టాప్ హీరోయిన్... డేటింగ్ లే జీవితం... పెళ్లెప్పుడంటే... ?
సినీ కెరీర్ పరంగా బాగానే ఉన్నా ఈమె లవ్ ట్రాక్ కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఆ మధ్య లండన్ కు చెందిన మైఖేల్ తో ప్రేమ వ్యవహారం నడిపిన శృతి తరచూ వార్తల్లో నిలిచారు. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన శృతి హాసన్ మంచి మంచి అవకాశాలను మిస్స్ చేసుకున్నారని కెరియర్ ని చేతులారా నాశనం చేసుకుంటున్నారని వార్తలు దుమారం రేగాయి. అయితే ఏమయ్యిందో ఏమోగానీ ఈ మధ్య వారు కలిసి కనిపించింది లేదు వీరి మధ్య 2019 లోనే బ్రేక్ అప్ అయినట్లు వార్తలు వినిపించాయి...ఇపుడు ఇన్నాళ్ల తరవాత మరో వ్యక్తితో ముంబై వీదుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తరచూ కెమెరా కళ్ళకు చిక్కుతోంది శృతి.
ఆ తర్వాత సంతను హజారికా తో రేలషన్ షిప్ లో ఉంది శృతి. ఇప్పుడిప్పుడే మళ్ళీ సక్సెస్ లు వరిస్తున్న వేళ మళ్ళీ ఇలా ప్రేమ వ్యవహారం తన కెరియర్ కి ఎక్కడ అడ్డుపడుతుందోనని ఆలోచనలో పడ్డారు శృతి హాసన్ ఫ్యాన్స్. ఇలా బాయ్ ఫ్రెండ్స్ ను మార్చుకుంటూ వెళ్ళడమేనా, పెళ్లి చేసుకునే ఆలోచన ఏమైనా ఉందా అని నెటిజన్లు అడుగుతున్నారు. ఆఖరికి ఈమె పెళ్లి విషయంలో తల్లితండ్రులు కూడా ఏమీ ఆలోచించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.