ఏంటో : ఇంతకీ తను బాయ్ ఫ్రెండా, లవరా శృతి .. ??
ఇక అక్కడి నుండి టాలీవుడ్ లో వరుసగా అనేక ఛాన్స్ లతో దూసుకెళ్లిన శృతి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా పలువురు స్టార్ నటుల సరసన అవకాశాలు అందుకుని వాటిని సక్సెస్ లుగా మలుచుకుంది. ఇక తన కెరీర్ లో మొదటి నుండి ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే అలవాటుగల శృతి, ఇటీవల తాను, స్నేహితుడు సంతన హజారికా తో రిలేషన్ లో ఉన్నట్లు ఒక ప్రముఖ టివి ఛానల్ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించింది. తన పర్సనల్ లైఫ్ గురించి అలానే నేను సింగిల్ గానే ఇంకా ఉన్నానా లేదా అనే విషయాల గురించి ఎవరిదగ్గర దాచాలనుకోవడం లేదు, మన జీవితం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది, ఏది తప్పో ఏది ఒప్పో మనకు తెలుసు. ఇక హజారికాతో నా అభిరుచులు కూడా కలిసాయి అని అందుకే ఇద్దరం మంచి రిలేషన్ లో ఉన్నాం అంటూ చెప్పుకొచ్చింది శృతి హాసన్. నిజానికి శృతి హాసన్ ఇప్పటికీ కూడా ఎక్కడా అతడిని ప్రేమిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించలేదు.
అలాగని అతడు తన బాయ్ ఫ్రెండ్ కాదని కూడా ఖండించలేదు కూడా. ఇక పలు ప్రాంతాల్లో ఈ జంట ఇద్దరూ కూడా కలిసి మొలిసి చక్కర్లు కొట్టడంతో వారిద్దరి ఫోటోలని క్లిక్ మనిపించిన కొందరు మీడియా వారు వారు ప్రేమలోనే ఉన్నారని అంటున్నారు. మరోవైపు ఇటీవల కరోనా అనంతరం ఈ ఇద్దరు పలు సందర్భాల్లో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. మరి నిజంగా శృతి హాసన్ అతడితో ప్రేమలో ఉందా లేక అతడు బాయ్ ఫ్రెండ్ మాత్రమేనా అనే దానిపై ఇప్పటికీ తమకు అర్ధం కావడం లేదని పలువురు నెటిజన్లు తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ విషయమై కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిజానికి తారలకు కూడా ప్రత్యేక లైఫ్ ఉంటుందని, మనం అందులోకి తొంగి చూసి వారి వ్యక్తిగత విషయాలు మనకి చెప్పమని కోరడం సబబు కాదని పలువురు సినీ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ఒకప్పటిలా మీడియా లేదు కాబట్టి, తారలకు సంబందించిన ఇటువంటి బంధాల పై పుకార్లు వస్తూనే ఉంటాయని వాటిని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు.