ఆచార్య : అరెరే! పెద్ద సమస్యే వచ్చిందే..

Purushottham Vinay
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా `ఆర్.ఆర్.ఆర్` వాయిదా సినిమా పరిశ్రమని ఎంతగా ఇబ్బంది పెడుతుందో అందరికి తెలిసిందే. జనవరి 7న రిలీజ్ అవ్వాల్సిన `ఆర్.ఆర్.ఆర్` వాయిదా పడింది.దీంతో మళ్లీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనేది ఇంకా క్లారిటీ లేదు. ఏప్రిల్ నెలలో విడుదల అని ప్రచారం సాగుతుంది.. కానీ విడుదల అయ్యే వరకూ గానీ అసలు సంగతేంటి? అన్నది మాత్రం తేలదు. మరి ఇలాంటి సందిగ్ధంలో ఆచార్య సినిమా రిలీజ్ ఎరక్కపోయి ఇరుక్కుపోయిందా? అంటే అవుననే సమాచారం తెలుస్తోంది. `ఆర్.ఆర్.ఆర్` సినిమా రిలీజ్ తర్వాత `ఆచార్య` సినిమా రిలీజ్ చేయాలన్నది డీల్. ఆ ఒప్పంద ప్రాతిపదికనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `ఆచార్య`సినిమాలో నటించడానికి దర్శకుడు యస్ యస్ రాజమౌళి ఒప్పుకున్నారు.లేదంటే తన సినిమా మధ్యలో ఉండగా మరో సినిమా కమిట్ మెంట్ కు జక్కన్న అసలు ఎంతమాత్రం ఒప్పుకోరు. మార్కెట్ స్ట్రాటజీ ప్రకారమే జక్కన్న చరణ్ ని అలా లాక్ చేసారు అన్నది నిజం. ఇక తాజాగా ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది.


ఎలాంటి పరిస్థితుల్లో `ఆర్.ఆర్.ఆర్`సినిమా రిలీజ్ కాకుండా `ఆచార్య` రిలీజ్ అవ్వడానికి వీలు లేదన్నది మేకర్స్ మరోసారి ఉద్ఘాటించినట్లు సమాచారం. దీన్నిబట్టి `ఆర్.ఆర్.ఆర్` సినిమా రిలీజ్ తర్వాతే `ఆచార్య` రిలీజ్ అవుతుందని లీక్ అందింది. పరిస్థితులు అన్ని సక్రమంగా ఉంటే ఏప్రిల్ నెలలో `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ అవుతుంది. ఇక ఆ తర్వాత `ఆచార్య` రిలీజ్ ఉంటుందని సమాచారం.అయితే `ఆచార్య` సినిమా ఫిబ్రవరి 4న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. `ఆర్.ఆర్.ఆర్` సినిమా జనవరి 7న అని ఫిక్స్ అయిన తర్వాత `ఆచార్య` రిలీజ్ వాయిదా పడింది. కానీ `ఆర్ ఆర్ ఆర్` సినిమా వాయిదా పడింది కాబట్టి ఇప్పుడు `ఆచార్య`సినిమా కూడా ఏప్రిల్ నెల తర్వాతనే ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ఆచార్య సినిమా ఏం చేసినా ఆర్.ఆర్.ఆర్ వల్ల ప్రతిసారీ వెనక్కి వెళ్లాల్సి వస్తోంది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రెండు భారీ సినిమాలు తక్కువ గ్యాప్ తో రిలీజవుతుండడం ఫ్యాన్స్ ని ఎగ్జయిట్ చేస్తోంది. నిజానికి దసరా పండుగ బరిలో వస్తుందనుకున్న ఆచార్య ఆ తర్వాత డిసెంబర్ చివరిలో వస్తుందని తర్వాత సంక్రాంతికి వస్తుందని ప్రచారమైంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా వల్ల మరోసారి వాయిదా పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి విడుదల తేదీపై సందిగ్ధత ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: