అప్పుడే అర్ధమైపోయిందట..కృతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

VUYYURU SUBHASH
కన్నడ ముద్దుగుమ్మలు మెల్లగా టాలీవుడ్ లో పాగా వేసేస్తున్నారు. ఒక్కోకరు గా వచ్చి తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఇక్కడ హిట్ కోట్టి బాలీవుడ్ వైపు అడుగులు వేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కన్నడ సోయగం రష్మిక మందన్నా టాలీవుడ్ లో వరుస హిట్ సినిమాలను పట్టి..బాలీవుడ్ లో బడా సినిమాలకు సైన్ చేసి..నేషనల్ క్రష్ గా మారిపోవడమే కాకుండా..టాప్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరిపోయింది. ఇక ఇదే రూట్ లో నడుస్తుంది లెటేస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి.

ఒక్కే ఒక్క సినిమాతో జాతకానే మార్చేసుకున్న ఈ ముద్దుగుమ్మ..రీసెంట్ గా నాని శ్యాం సింగరాయ్ సినిమాలో కీర్తి పాత్రతో మెప్పించింది. అంతేకాదు నాని తో హాట్ రొమాన్స్ సీన్లు చేసి స్టార్ హీరోయిన్స్ కు సైతం షాక్ ఇచ్చింది. రెండో సినిమాకే ఇంత హాట్ సీన్స్ నా బాబోయ్ అంటూ కృతిని ట్రోలింగ్ చేసిన వారు కొందరైతే..సినిమాలో తన పాత్ర కోసం ఏదైన చేస్తుంది కృతి అంటూ కొందరు మెచ్చుకున్నారు. ఇక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మంచి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది.

ఇక అమ్మడు ఖాతలో నాలుగు ప్రాజెక్టులు  రెడీగా ఉన్నాయి. అందులో ఒకటి  ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా. ఈ సినిమాలో కృతి హీరోయిన్ గా చేస్తుండగా..హీరో గా సుధీర్ బాబు మనకు కనిపించనున్నారు. ఈ సినిమా  ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరగ్గా ..అందులో కృతి మాట్లాడుతూ.."హీరో సుధీర్ బాబు ను ఓ రేంజ్ లో పొగిడేస్తూ..నాకు చాలా సపోర్ట్ ఇచ్చారంటూ.."ఆ అమ్మాయి గురించి చెప్పాలి" సినిమా షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే  నాకు గొప్ప అనుభవం ఇచ్చే సినిమా ఇది అని అర్థమైపోయింది అంటూ ..ఈ సినిమా అంతా కూడా మన ఇరుగు పొరుగు ఇంట్లో జరిగినంత నేచురల్ గా ఉంటుంది" అని చెప్పుకొచ్చింది.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: