RRR: అలా చెప్పి ప్రేక్షకులని మోసం చేయను..!
సినిమా నేషనల్ వైడ్ ప్రమోషన్స్ లో భాగంగా కొత్తగా అలియా భట్, అజ దేవగన్ పాత్రల గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసి షాక్ ఇచ్చాడు జక్కన్న. సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ హీరోలుగా చేస్తున్నా సినిమాకు సోల్ మాత్రం అజయ్ దేవగన్ పాత్ర అని చెప్పారు రాజమౌళి. ఇక అలియా భట్ పాత్ర కూడా అదే రేంజ్ లో ఉంటాయని. ఇద్దరు సిం హాళ్లాంటి హీరోలని తన పాత్రతో బ్యాలెన్స్ చేస్తుంది అలియా భట్. అయితే సినిమాలో వీరి పాత్రల నిడివి తక్కువే అని ఆ విషయంలో ప్రేక్షకులను మోసం చేయాలని అనుకోవడం లేదని అన్నారు రాజమౌళి.
అలియా భట్, అజయ్ దేవగన్ పాత్రలు ఆర్.ఆర్.ఆర్ కు చాలా కీలకమని. పాత్రల నిడివి కన్నా ఆ పాత్రల స్వభావం.. వాటి వల్ల సినిమాకు ఏర్పడిన ఇంప్యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అన్నారు. ఇక ఎన్.టి.ఆర్, చరణ్ లు ఇద్దరు నెక్స్ట్ లెవల్ లో నటించారని. తెర మీద మీరో అద్భుతాన్ని చూడబోతున్నారని చెప్పి ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెంచాడు రాజమౌళి. తప్పకుండా ఈ అంచనాలు చూస్తుంటే సినిమా బాహుబలిని బీట్ చేసేలా ఉంది. సినిమాను వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ట్రిపుల్ ఆర్ మీద ఎఫెక్ట్ పడేలా ఉంది.