థమ్స్ అప్ తో డీల్ క్లోజ్ చేసుకున్న మహేష్.. ఎందుకంటే..!
అయితే లేటెస్ట్ గా మహేష్ థమ్స్ అప్ బ్రాండింగ్ డీల్ క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది. ఎన్నో ఏళ్లుగా మహేష్ థమ్స్ అప్ కు బ్రాండింగ్ చేస్తూ వచ్చారు. సడెన్ గా ఎందుకు ఆయన థమ్స్ అప్ బ్రాండింగ్ కు గుడ్ బై చెప్పారంటే కొత్త కంపెనీకి బ్రాండింగ్ చేస్తూ థమ్స్ అప్ అగ్రిమెంట్ క్లోజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. కోకో కోలాతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని మహేష్ కొత్తగా పెప్సీ కంపెనీకి సైన్ చేసినట్టు తెలుస్తుంది. పెప్సి నుండి వస్తున్న మౌంటైన్ డ్యూ కోసం మహేష్ బ్రాండింగ్ చేస్తారని తెలుస్తుంది.
మహేష్ ప్లేస్ లో థమ్స్ అప్ కోసం వేరే హీరోని తీసుకొస్తారని తెలుస్తుంది. థమ్స్ అప్ తో మహేష్ రిలేషన్ దాదాపు క్లోజ్ అయినట్టే. అయితే పెప్సి నుండి వస్తున్న మౌంటైన్ డ్యూ కోసం మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండనున్నారు. మరి మహేష్ బ్రాండ్ మార్చాడు కాబట్టి ఆయన ఫ్యాన్స్ కూడా బ్రాండ్ మార్చేస్తారా లేదా అన్నది చూడాలి. రాబోయే సమ్మర్ లో మౌంటెన్ డ్యూని ఎక్కువగా ప్రమోట్ చేసేందుకు మహేష్ తో యాడ్ షూట్స్ ప్లాన్ చేస్తున్నారట.