'ఊ అంటావా.. ఉహూ అంటావా'.. ప్రియమణి డాన్స్ చూసారా?

praveen
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా అదే పాట వినిపిస్తుంది. చిన్నల నుంచి పెద్దల వరకు అందరి నోళ్లలో అదే పాట నానుతూ ఉంది.. ముఖ్యంగా యూత్ అందరినీ అయితే ఈ పాట ఎంతగానో మత్తెక్కిస్తుంది. ఎంతోమందిని చిందులు వేసేలా చేస్తుంది.. ఇంకెంతో మంది ని  అలరిస్తుంది. ఇంతకీ ఆ పాట ఏంటి అని అనుకుంటున్నారా...అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాలోనూ ఊ అంటావా ఉహూ అంటావా అనే పాట. సాధారణంగా ఈ పాట వినడానికి ఎంతో మత్తుగా ఉంటుంది. ఇక ఈ ఐటెం సాంగ్ చేసిన సమంత ఈ పాటను మరింత మత్తు గా మార్చి.. ప్రేక్షకులు అందరినీ మంత్రముగ్ధులను చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇక ఇప్పుడు ఈ పాట కాస్త ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ పాట వినిపిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ కూడా సమంత ఊ అంటావా ఊహూ అంటావా పాట పై డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇలా సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే చాలు ఈ పాట పై ఎంతోమంది డాన్స్ చేసిన వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇకపోతే ఇటీవలె హీరోయిన్ ప్రియమణి సమంత ఊ అంటావా ఉహూ అంటావా పాటకి అదిరిపోయే డాన్స్ చేసింది. ఇక ఇది చూసిన అభిమానులు అందరూ ఆశ్చర్యపోయారు అనే చెప్పాలి.



 పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇచ్చిన ప్రియమణి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. సినిమాలు వెబ్ సిరీస్ లు అనే తేడా లేకుండా సత్తా చాటుతోంది ప్రియమణి. ఇకపోతే బుల్లితెరపై అనే ఢీ కార్యక్రమంలో జడ్జిగా అవతారమెత్తింది. ఇక అప్పుడప్పుడు ఈ కార్యక్రమంలో డాన్సులు కూడా చేసి అదరగొడుతోంది. ఇక ఇటీవలే వచ్చేవారం ఢీ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో భాగంగా ఒక కంటెస్టెంట్ ఊ అంటావా ఊహూ అంటావా అనే పాట పై డాన్స్ చేస్తుంది. పర్ఫార్మెన్స్   పూర్తయిన తర్వాత అటు ప్రియమణి కూడా స్టేజ్ పైకి వెళ్లి ఎంతో హాట్ హాట్ పర్ఫామెన్స్ చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: