మెగా ప్రిన్స్ కటౌట్ అదిరింది బాసు..!

shami
మెగా హీరోల్లో సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఓ పక్క కామెడీ ఎంటర్టైనర్స్ ఎఫ్2, ఎఫ్3 లాంటి సినిమాలు చేస్తూ మరోపక్క మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. వరుణ్ తేజ్ ప్రస్తుతం గని సినిమా చేస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కుతుంది. ఎ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా సయి మంజ్రేకర్ నటిస్తుంది. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.
సినిమా కోసం వరుణ్ తేజ్ ఓ రేంజ్ లో హార్క్ వర్క్ చేసినట్టు తెలుస్తుంది. గని సినిమాలో వరుణ్ తేజ్ సిక్స్ ప్యాక్ లుక్ తో కనిపించనున్నాడు. లేటెస్ట్ గా గని సినిమా కోసం వరుణ్ తేజ్ వర్క్ అవుట్స్ చేస్తున్న పిక్ ఒకటి షేర్ చేశాడు. సిక్స్ ప్యాక్ లుక్ తో మెగ ప్రిన్స్ కిరాక్ లుక్ షేర్ చేశాడు. బీ యువర్ సెల్ఫ్ .. బట్ ఆల్వేస్ బెటర్ సెల్ఫ్ అంటూ.. మీరు మీలా ఉండండి.. కానీ ఎప్పుడూ బెటర్ గా ఉండండి అని మెసేజ్ ఇస్తున్నాడు వరుణ్ తేజ్. మెగా హీరో సిక్స్ ప్యాక్ లుక్ ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంది. సినిమాకి కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారని హీరోలది ఏముంది అంటుంటారు కానీ వారు పడే కష్టం ఎవరికి కనిపించదు. సినిమా పాత్రకు తగినట్టుగా ఆహార్యం మార్చుకోవడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు స్టార్స్.
ఓ పక్క గని కోసం సిక్స్ ప్యాక్ తో షాక్ ఇస్తున్న వరుణ్ తేజ్ మరోపక్క విక్టరీ వెంకటేష్ తో కలిసి ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో మరోసారి తన కామెడీతో మీప్పించాలని చూస్తున్నాడు వరుణ్ తేజ్. గని, ఎఫ్3 రెండు డిఫరెంట్ సినిమాలతో 2022 లో మెగా ఫ్యాన్స్ ను అలరించాలని చూస్తున్నాడు వరుణ్ తేజ్. తప్పకుండా మెగా హీరోల్లో వరుణ్ తేజ్ కూడా మంచి పొజిషన్ కు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: