బాలకృష్ణ-రవితేజ : నూతన అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమో.. వైరల్..?
తాజాగా ఈయన మాస్ మహారాజ్, దర్శకుడు గోపిచంద్ మలినేనిలనుతన షోలో ఇంటర్వ్యూ చేసారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించి ఓ ప్రోమోను విడుదల చేసిన ఆహా టీమ్ మరొక ప్రోమోను విడుదల చేసారు. ఈ ప్రోమోలో గోపిచంద్ మలినేని బాలయ్య, రవితేజలకు ఓ తాడు ఇచ్చి వీరిద్దరిలో మీ భార్య అంటే షేక్ మస్తాన్ అని ప్రశ్న వేసారు. మీలో మీభార్యకు ఎవరు మీ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ గురించి చెప్పారంటూ గోపిచంద్ మలినేని అడిగిన ప్రశ్నలకు బాలకృష్ణ, రవితేజలు ఆన్సర్ అదిరి పోయే విధంగా ఉంది ఈ ప్రోమో.
అయితే ముందు విడుదల చేసిన ఈ ప్రోమోలో బాలయ్య ఈ షోను మనం మొదలు పెట్టే ముందు ఓ క్లారిటీ ఇచ్చుకోవాలి బాస్. నీకు, నాకు పెద్ద గొడవ అయిందటగా.. అవును పని పాటా లేని డాష్ నా డాష్ గాళ్లకు ఇదే పని అంటూ రవితేజ సమాధానం చెప్పారు. బాలయ్య, రవితేజ మధ్య జరిగిన తగాదా ఉత్తదే అని తేల్చేసారు. రవితేజ నీకు కోపం వచ్చినప్పుడు సరదాగా చెప్పే నాలుగు బూతులు చెప్పు. నేను బూతులు మొదలెడితే.. ప్రేక్షకులు చస్తారంటూ.. నవ్వుతూ క్లారిటీ ఇచ్చారు రవితేజ. అతివినయం దూర్త లక్షణం అని చేతులు కట్టుకుంటే డిప్ప పగిలిపోతుందని.. రవితేజకు బాలయ్య స్వీట్ వార్నిం్ ఇచ్చాడు. అవతల వాడి బిహేవియర్ బట్టి వీడు తేడా అనే విషయం తెలిసిపోతుందని కదా మీకు అని, లేకపోతే చంప ఛల్లు మనాల్సిందే అంటూ రవితేజ కాసేపు నవ్వించారు.
మొగల్రాజపురం అమ్మాయిలకు లైన్ వేసే వాడివి అంటూ బాలయ్య అడిగిన ప్రశ్నకు రవితేజ అవాక్కు అయ్యారు. బాలయ్య కలుజేసుకుని తప్పేంటయ్యా.. నేను చిన్నప్పుడు అమ్మాయిలకు లైన్ వేసే వాడిని అన్నారు. ఇక బాలయ్య అడిఇన ప్రశ్నలకు రవితేజ.. ఇలా మాట్లాడారు. నా గురించి మీకు ఈ విషయాలు ఎలా తెలుసు.. ఎవరు ఇచ్చారన్న రవితేజ ప్రశ్నకు బాలయ్య మాది కృష్ణాజిల్లానే అని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ షోలో దర్శకుడు గోపిచంద్ మలినేని కూడా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ ఎపిసోడ్ ఇవాళ రాత్రి 8 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానున్నది.