సినిమా టికెట్ల వివాదం ఇంకెంత దూరం వెళుతుందో?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య టికెట్ల రేట్ల విషయంలో పెద్ద యుద్దమే జరుగుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఏపిలో మూవీ టికెట్స్ విషయం గురించి హాట్ టాపిక్ గా మారింది. టికెట్ల రేట్లు పెంచే పనిలో ఇండస్ట్రీ ఉండగా ...ఆ ఆలోచనకు అడ్డు కట్ట వేసేలా టికెట్ల రేట్లు పెంచ కూడదని ఆదేశమిచ్చింది ప్రభుత్వం. అంతే కాకుండా టికెట్ల ధరలు ఇంతే ఉండాలి అంటూ నిర్ణయిస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం మేము టికెట్ ధరలు తగ్గించలేదని గతంలో ఉన్న వాటినే కొనసాగిస్తున్నామని చెప్పారు. దాంతో సినీ ఇండస్ట్రీ పెద్దలు రంగం లోకి దిగారు. పెద్ద ఎత్తున ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమయ్యారు. తమ వ్యతిరేకతను తెలియచేస్తున్నారు.

ఈ అంశంపై ప్రముఖ టాలివుడ్ నిర్మాత దిల్ రాజు సైతం మాట్లాడుతూ ఈ విషయం గురించి ప్రభుత్వంతో చర్చిస్తాము. మాపై ఒత్తిడి పెంచినా ముందుకే వెళతాం, వెనక్కి తగ్గం. సినిమాలు అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ దిల్ రాజు అన్న మాటలు వివాదానికి తావిస్తున్నట్లు ఉంది. ప్రభుత్వం నుండి రిపోర్ట్ వచ్చే వరకు ఎవ్వరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. ఇండస్ట్రీ నుండి వ్యతిరేకత పెరుగుతుండటంతో ఈ విషయాన్ని చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకుని సమస్యను పరిష్కరించడానికి ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

ఈ కమిటీకి చైర్మన్ గా హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ.  కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్, MA & UD డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, I&PR వంటి సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ఈ కమిటీ సినీ పెద్దలలో భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న టికెట్ల పంచాయితీ ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతుంది. ఇక ఎప్పుడైనా ఈ సమస్య సర్దుమణుగుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: