ఆర్ఆర్ఆర్ : ఆ సినీ క్రిటిక్ జోస్యం ఫ‌లిస్తుందా?

Anilkumar
యావత్ ప్రపంచం సైతం ఎదురు చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే తాజాగా ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన ఓ పోస్ట్  ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే బాలీవుడ్పై ఈ సినిమా చాలా భారీగా ఉంటుందని ఆయన చెప్పాడు. మెట్రో సెంట్రిక్ సినిమాలను చేయడంలో టాలీవుడ్ చాలా బిజీ ఉందని... 


అంటే మనం గ్రామీణ ప్రాంతాలను వదిలేసి చాలా నాళ్ళు అవుతుందని... ప్రస్తుతం మనం ఇప్పుడు టైర్-2, టైర్-3 నగరాలు, పట్టణాలను కూడా వదులు కొంటున్నాం... అయితే హిందీలోకి డబ్ అవుతున్న మెట్రోలు, నాన్ మెట్రోలను కూడా టార్గెట్ చేస్తున్నాయి. అయితే తాజాగా 'బాహుబలి', 'కేజీఎఫ్', 'పుష్ప' హిందీ చిత్రాలు  మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రభావం బాలీవుడ్ పై కూడా చాలానే ఉంది.. ఈ సినిమా కోసం వెయిట్ చేద్దాం అంటూ ఆయన తెలిపారు. ఈ సినిమా బాక్సాఫీస్ను ఒక ఒప్పేసుకుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. 


అయితే తాజాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈయన చెప్పింది నిజం అవుతుందా లేదా అని అందరు ఎదురు చూస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఆర్ఆర్ఆర్'లో రామ్చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలలో కనిపించనున్నారు. వీరికి జోడిగా ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్  నటిస్తున్నారు. వీరితో పాటుగా అజయ్ దేవ్గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు.  ఈ సినిమాను సుమారు 450 కోట్ల రూపాయలతో నిర్మించగా ఈ సినిమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: