అలాంటి సీన్స్ లో 100% ఇస్తా : తానియా

praveen
సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవరు స్టార్లుగా మారిపోతారు అన్నది మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. సినిమా ప్రపంచంలో  ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కూడా అదే రేంజ్ లో కలిసి రావాలి. అప్పుడే నటీనటులు బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో కి రావాలి అంటే సినిమా అనేది ఒకటే ఆప్షన్ గా ఉండేది. కానీ నేటి రోజుల్లో మాత్రం యూట్యూబ్, వెబ్ సిరీస్ లు అంటూ ఎన్నో రకాలుగా ఎంతో మంది నటులకు తమని తాము నిరూపించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది నేటి రోజుల్లో కూడా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ ఎంతగానో గుర్తింపు సంపాదిస్తున్నారు.



 ఇలా వెబ్ సిరీస్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో తానియా చటర్జీ కూడా ఒకరు. ఈమె పుట్టింది పెరిగింది చదువు పూర్తి చేసింది మొత్తం కోల్కతాలోనే. చిన్నప్పటి నుంచి డాన్స్ మీద మక్కువతో ఎంతో కష్టపడి డాన్స్ నేర్చుకుంది. చిన్నప్పటి నుంచి సినిమాల్లో హీరోయిన్ కావాలి అని కలలు కంటూ వచ్చింది.  ఇక ఈ కలను నిజం చేసుకునే దిశగా ప్రతి అడుగు వేసింది. ఈ క్రమంలోనే పుట్టిన కోల్కతా ను వదిలి ముంబై లో అడుగు పెట్టింది.  సినిమా ఛాన్స్ కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగింది. ఈ క్రమంలోనే 2017 లో 'అమీ జెకె తోమా' అనే బెంగాలీ సినిమాతో తెరమీద కనిపించింది.



 మొదటి సినిమాలోనే అద్భుత నటనతో అందంతో అభినయంతో ఆకట్టుకోవడంతో తానియా వరుస అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత వరుసగా రెండు బెంగాలీ సినిమాలు, ఆల్బమ్స్ చేస్తూ కూడా ఎంత బిజీ బిజీగా మారిపోయింది. ఆమె నటనకు ఫిదా అయిన బాలీవుడ్ తానియా కు స్వాగతం పలికింది. 2019 లో వచ్చిన ఫ్లాట్ మేట్స్ అనే బాలీవుడ్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఈ సినిమాలోనూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వెబ్ దునియా లో అడుగుపెట్టి  గందీ బాత్ 4 సిరిస్ లో నటిస్తుంది. బోల్డ్ పాత్రల్లో నటించటంపై ఆసక్తి గల వ్యాఖ్యలు చేసింది.  పాత్ర ఏదైనా 100% న్యాయం చేయాలని నేను అనుకుంటా.. అందుకే బోల్డ్ సీన్స్ లో నటించటం ఇబ్బందిగా అనిపించినప్పటికీ 100%ఇస్తాను అంటూ తానియా చటర్జీ  చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: