ఒమిక్రాన్ : క‌ర్నాట‌క‌లో ఆర్ఆర్ఆర్ కు ఎఫెక్ట్ లేదు..?

N ANJANEYULU

ఇటీవ‌ల ద‌క్షిణాఫ్రికాలో వెలుగులోకి వ‌చ్చిన క‌రోనా నూత‌న వేరియంట్ ఒమిక్రాన్ భార‌త్‌లో కూడా బాగానే వ్యాపిస్తుంద‌ని తెలుస్తోంది. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే ఒమిక్రాన్ కేసులు న‌మోద‌వుతూ ఉన్నాయి. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌, సెకండ్ వేవ్‌ల‌తో ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వాలు  ఆర్థికంగా చాలా న‌ష్ట‌పోయాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ వ్యాప్తి త‌రుణంలో మ‌రొక‌సారి లాక్‌డౌన్ విధిస్తే.. ఆర్థిక రాష్ట్రాల‌లో కూరుకుపోయే ప్ర‌మాదం లేక‌పోలేదు.

 ఇదిలా ఉండ‌గా.. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వైర‌స్ క‌న్నా 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుండ‌టంతో క‌ర్నాట‌క‌లో రాత్రి పూట క‌ర్య్పూ విధిస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ది. అయితే డిసెంబ‌ర్ 28 నుంచి జ‌న‌వ‌రి 07 ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు అన‌గా దాదాపు 10 రోజుల పాటు క‌ర్ప్యూ విధిస్తున్న‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. క‌ర్నాట‌క‌లో రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ప్యూ విధిస్తున్నాం అని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. ముఖ్యంగా ఓమిక్రాన్‌పై ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి అని సూచించింది ప్ర‌భుత్వం. సామూహిక కార్య‌క్ర‌మాల‌పై కూడా ఆంక్ష‌లు ఉండ‌నున్న‌ట్టు అధికారులు పేర్కొన్నారు.

క‌ర్నాట‌క రాష్ట్రంలో రాత్రి స‌మ‌యంలో  డిసెంబ‌ర్ 28న‌  రాత్రి 10 గంట‌ల నుంచి జ‌న‌వ‌రి 07 వ తేదీ ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు రాత్రి స‌మ‌యంలో క‌ర్ప్యూ విధించ‌బ‌డింది. అయితే తొలిరోజు ఆర్ఆర్ఆర్ షోలు, నైట్ షోల‌పై ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌ద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ సినిమా ప్ర‌చారాన్ని జోరుగా కొన‌సాగిస్తున్నారు. ఇవాళ ఆర్ఆర్ఆర్ టీమ్ బిగ్‌బాస్ 15 వేదిక‌పై స‌ల్మాన్ ఖాన్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను జ‌రుపుకోనున్నారు.  ఈ ఎపిసోడ్‌కు సంబంధించి వీడియోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. నాటు నాటు సాంగ్‌కు చ‌ర‌ణ్‌, తార‌క్‌లు చేసిన స్టెప్పుల‌ను నేర్చుకుని మ‌రీ వేసాడు స‌ల్మాన్‌. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రామ్‌చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుండ‌డంతో ఒమిక్రాన్ వేరియంట్ మూలంగా విడుద‌ల కాదు అని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. అధికారికంగా చిత్ర‌బృందం మాత్రం ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. చూడాలి మ‌రీ జ‌న‌వ‌రి 07 న ఆర్ఆర్ఆర్ విడుద‌ల అవుతుందా..? లేక  వాయిదా ప‌డుతుందా అనేది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: