హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2021:వెరైటీ గా ప్రపోజ్.. గ్రాండ్ గా ఎంగేజ్మెంట్.. అంతలోనే బ్రేకప్ చెప్పిన మెహ్రిన్..!

murali krishna
నాని సినిమా కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్‌. ఆ సినిమా మంచి విజయం సాధించడం తో తెలుగులో మంచి అవకాశాలు ఆమెకు వచ్చినట్లు తెలుస్తుంది. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుందని తెలుస్తుంది. చిన్న చిన్న సినిమాలు చేస్తూ విజయం సాధిస్తూ వస్తున్న మెహ్రిన్ కు f2 సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా విడుదలయి వసూళ్ల వర్షం కురిపించింది. f2 సినిమాకు ముందు రవితేజతో చేసిన రాజా ది గ్రేట్ కూడా భారీ వసూళ్లు రాబట్టింది. కానీ ఆ సినిమాలో ఆమెది కొద్దిగా సీరియస్ పాత్ర కావటంతో అంతగా గుర్తింపు రాలేదని తెలుస్తుంది. ఆ తరువాత వరుసగా తెలుగు,తమిళ,మలయాళ సినిమాలు చేస్తూ బిజీగా ఉందని తెలుస్తుంది.


ఇదిలా ఉండగా తన నిశ్చతార్థం కాన్సల్ అయిందని ప్రకటించిందట. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజనలాల్ బిష్ణయ్ మనుమడు భవ్య భిష్ణయ్ ఇటీవల ఎంగేజ్ మెంట్ అంగరంగ వైభవంగా జరిగినట్లు తెలుస్తుంది. రాజకీయ కుటుంబంలోకి మెహ్రిన్ అడుగు పెట్టబోతుంది అని హాట్ టాపిక్ మారినట్లు సమాచారం. కానీ ఆ నిశ్చతార్థం పెళ్లి పీటల వరకు వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయినట్లు తెలిపిందట మెహ్రిన్. సముద్రం అడుగులో ఎంతో వెరైటీగా మెహ్రిన్ కి భవ్య భిష్ణయ్ ప్రొపోజ్ చేసాడు. కొంతకాలం వరకు వారు ప్రేమించుకున్నారు. వారి ప్రేమ నిశ్చతార్థం వరకు వెళ్లిందట. ఏం జరిగిందో  ఏమో కాని తన పెళ్లి జరగడం లేదని చెప్పుకొచ్చిందటమెహ్రిన్. ఇకపై ఆ కుటుంబంతో తనకి ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చిందట మెహ్రిన్.ఈ విషయంలో తన మనసు చెప్పినట్లు నిర్ణయం తీసుకున్నానని ఈ విషయాన్ని తన బంధుమిత్రులు అలాగే అభిమానులు అర్ధం చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చిందట. అయితే ఎందువల్ల తను వివాహం రద్దు చేసుకుంటుందో చెప్పలేదని తెలుస్తుంది. ఈ విషయంలో బిష్ణయి కమ్యూనిటీవారు నేటిజన్స్ రకరకాలుగా స్పందించరాట. మెహ్రిన్ సినిమాలలో నటించడంవల్లే విభేదాలు తలెత్తినట్లు సమాచారం. పెళ్లి తరువాత నటించే విషయంపై అభిప్రాయభేదాలు తలెత్తినట్లు సమాచారం. అందుకే ఈ పెళ్లి కథ ముగిసింది అని చెప్తున్నాయట చిత్ర పరిశ్రమ వర్గాలు. ఇటీవల డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో వచ్చిన మంచిరోజులు వచ్చాయి సినిమాలో నటించిన మెహ్రిన్ మంచి విజయం అందుకుందట. ఆ తరువాత f2 సినిమాకు సీక్వల్ అయిన f3లో నటిస్తుందని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: