60 అడుగుల ఎత్తున చరణ్ జూనియర్ లకు చుక్కలు చూపెట్టిన రాజమౌళి !

Seetha Sailaja
రాజమౌళి సినిమాలో ఒక హీరో నటిస్తే ఎంత పేరు వస్తుందో అంతకుమించి విపరీతమైన కష్టాన్ని ఆహీరో పడవలసి ఉంటుంది. రాజమౌళితో సినిమా ఒప్పుకున్న తరువాత ఆ హీరో పూర్తిగా జక్కన్న ఆధీనంలోకి వెళ్ళిపోతాడు అన్నది ఓపెన్ సీక్రెట్. ఈవిషయాలు గురించి ఇప్పటికే అనేకమంది హీరోలు రాజమౌళితో తాము పడ్డ కష్టాల గురించి అనేకసార్లు వివరించారు.  


ఇంత కష్టపడినా రాజమౌళితో సినిమాలో ఛాన్స్ వస్తే చాలు అని కోరుకుంటూ ఉంటారు. వచ్చేనెల విడుదల కాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక బాలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ జూనియర్ లు తాము రాజమౌళితో పడిన కష్టాల గురించి వివరించారు. సాధారణంగా ఒక సినిమా ప్రారంభం అయినప్పుడు ఆమూవీ దర్శకుడు తన సినిమాలో నటించే హీరోలకు ఒక వారం రోజుల వరకు పెద్దపెద్ద సీన్స్ అలాగే ఫైట్స్ ఇవ్వకుండా ఆ షూటింగ్ వాతావరణానికి అలవాటు పడేలా చిన్నచిన్న సీన్స్ తీస్తారని అయితే ఈవిషయంలో జక్కన్న తీరు విభిన్నం అంటూ కామెంట్స్ చేసారు.


‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ప్రారంభం రోజు నుండే తమకు టార్చర్ మొదలైంది అని చెపుతూ ఈ షూటింగ్ మొదటిరోజున తమ ఇద్దరికీ తాళ్ళు కట్టి 60 అడుగుల ఎత్తులోకి పంపించి అక్కడ చుక్కలు చూపిస్తూ ఆ ఎత్తులో ఎక్స్ ప్రెషన్స్ వచ్చేలా యాక్షన్ సీన్ కు ప్రాక్టీస్ చేయించిన విషయాన్ని బయటపెట్టాడు. ఆరోజు అంతా రిహార్సల్ అంటూ 60 అడుగుల ఎత్తులో ఉంచి అంత భారీ రిహార్సల్ తో తనకు ఒళ్ళు నొప్పులు వచ్చాయి అని చరణ్ చెప్పినా వినకుండా రెండవరోజు అదే యాక్షన్ సీన్ ను రియల్ సీన్ గా మార్చి షూట్ చేసిన విషయాన్ని జూనియర్ బయటపెట్టాడు.


ఆ సీన్ పూర్తి అయిన తరువాత మరునాడు తమ ఇద్దరికీ బరువులు కట్టి 20 అడుగుల నీటి లోతులోకి దించాడని ఆ టార్చర్ కు చరణ్ ఇబ్బంది పడుతుంటే ఇలాంటివి పట్టించుకుంటే రాజమౌళితో సినిమా చేయలేవు అన్న విషయాన్ని జూనియర్ బయటపెట్టాడు..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: