టాలీవుడ్ యంగ్అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు. హీరో ఇప్పుడు తాజాగా చేస్తున్న సినిమా అర్జున ఫల్గుణ`. సినిమాకి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఇక ఈ సినిమాలో హీరో విష్ణుకి జోడీగా అమృత అయ్యర్ నటించింది. వీరితో పాటుగా నరేష్, శివాజీ రాజా, దేవీ ప్రసాద్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ స్వరాలందించారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు పూర్తిగా అయిపోవడంతో డిసెంబర్ 31వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జరుగుతుండగా ఈ సినిమా ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా మరియు ఎంతో త్రిల్లింగ్ గా ఉంది. అయితే ఈ సినిమా గంజాయి మాఫియా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుందని ఈ ట్రైలర్ ను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. నటుడు సుబ్బరాజు ఈ సినిమాలో పోలీస్ పాత్రలో అందరికీ కనిపించనున్నాడు. సినిమాలో హీరో మాత్రం చివరకు ఒక మాటతో పోలీసుల నుంచి తప్పించుకోవడం మనం ఈ ట్రైలర్ లో చూడవచ్చు.
సినిమాలో తను ఏ మాట చెప్పాడు అనేది ఇది సినిమా చూస్తే కానీ మనకి అర్థం కాదు. ఇకపోతే విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాలో హీరో మరియు హీరో స్నేహితులు ఎన్టీఆర్ వీరాభిమానులు గా కనిపించబోతున్నారు. ఇక ట్రైలర్ ను బట్టి చూస్తే సినిమాలో ఎన్టీఆర్ ని కూడా బాగానే వాడినట్లు అర్థమవుతుంది ఇకపోతే ఈ హీరో ఇటీవలే రాజ రాజా చొర అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకొని మంచి ఊపు లో ఉన్నాడు. దీంతో తాజాగా నటిస్తున్న అర్జున పాల్గొన్న సినిమా కూడా మంచి అంచనాలు ఉన్నాయి మరి ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకుంటాడా లేదా అనేది తెలియాలంటే డిసెంబర్ 31వ తేదీన సినిమా చూస్తే కానీ అర్థం కాదు...!!