ఏపీలో సినిమా టికెట్స్ విషయంలో జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై చిత్రసీమ అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వ్యవహారం ఫై పబ్లిక్ గా జగన్ సర్కార్ ఫై నిప్పులు కురిపించగా ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ దారిలోనే మిగతా వారు నడుస్తున్నారని తెలుస్తుంది.
గురువారం హీరో నాని జగన్ సర్కార్ ఫై గట్టిగానే ఫైర్ అయ్యారని సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందంటూ శ్యామ్ సింగ్ రాయ్ ప్రెస్ మీట్ లో నాని అన్నారట.. 10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్ కంటే పక్కనే ఉన్న కిరాణ కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉంటుందన్నారట.. ఇప్పుడు ఏం మాట్లాడిన కూడా వివాదం అవుతుందన్నారటనాని. టికెట్ ధరలు పెంచినా కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందన్నారట. టూర్ కు తీసుకెళ్లే పిల్లల నుంచి ఉపాధ్యాయులు ఒక్కొక్కరి నుంచి 100 వసూలు చేస్తే ఒకరిని నువ్వు ఇవ్వలేవంటే అవమానించడమే అన్నారట నాని. నా పేరు ముందు నేచురల్ స్టార్ తీసేద్దామనుకుంటున్నా అన్నారట.. ప్రేక్షకులకు సినిమా చూపించడమే మా లక్ష్యమన్నారని మా లెక్కలు తర్వాత చూసుకుందామన్నారట.
నాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స మండిపడ్డారని తెలుస్తుంది.. సినిమా టికెట్లు విక్రయంలో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుందట.. ఇందులో ఎవరికైనా, ఏమైనా ఇబ్బందులు ఉంటే, వారు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసుకోవాలి కానీ అలా కాకుండా మా ఇష్టారాజ్యంగా చేసుకుంటామంటే కుదరదని ఎంఆర్పీ అనేది ఈరోజు ప్రతి వస్తువుకీ ఉంటుందని ఎంఆర్పీ లేకుండా భారతదేశంలో ఏ వస్తువు అయినా అమ్ముతున్నామా..దేనికైనా ఎంఆర్పీ అన్నది ఉండాలి అలాంటిది సినిమా టికెట్లకు ఉండకూడదా. ఇదెక్కడి న్యాయం.అని ప్రశ్నించారట బొత్స.
బొత్స వ్యాఖ్యలకు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారట.. మాగ్జిమమ్ రిటైల్ ప్రైస్ (ఎమ్మార్పీ) అనేది ఓ వస్తువు ఉత్పత్తిదారులు నిర్ణయిస్తారని స్పష్టం చేశారట.. అంతేతప్ప ఎమ్మార్పీ ధరలు ప్రభుత్వం నిర్ణయించదని చురక అంటించారట.. ఏపీలో సినిమా టికెట్ల ధరలను ఇటీవల ప్రభుత్వ నిర్ణయించడాన్ని దృష్టిలో ఉంచుకుని శోభు యార్లగడ్డ ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతోందని తెలుస్తుంది.
సినిమా టికెట్ల వ్యవహారం నేపథ్యంలో ఏపీలో 50 థియేటర్లు మూతపడ్డాయని ఆయనవెల్లడించారట.. దీని ప్రభావం రాబోయే చిత్రాల విడుదలపైనే కాకుండా దీర్ఘకాలంలో ఎగ్జిబిటర్ వ్యవస్థపైనా తెలుగు సినీ పరిశ్రమపైనా తీవ్రస్థాయిలో ఉంటుందని శోభు యార్లగడ్డ పేర్కొన్నారట.. ఇవాళ నాని చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని తెలిపారని తెలుస్తుంది..