యంగ్ బ్యూటీస్ కు సీనియర్ హీరోయిన్స్ కాంపిటీషన్..!

NAGARJUNA NAKKA
మాధురీ దీక్షిత్‌ ఫిఫ్టీ క్రాస్ చేసి నాలుగేళ్లు దాటింది. మరో ఆరేళ్లల్లో సీనియర్ సిటిజన్ కోటాలో చేరబోతుంది. అయినా మాధురి ఇప్పటికీ అభిమానులని సర్‌ప్రైజ్ చేస్తూనే ఉంది. యంగ్‌స్టర్ రణ్‌బీర్ కపూర్ లాంటి హీరోలు కూడా మాధురి గ్లామర్‌కి ఫిదా అవుతున్నారు. మాధురితో డ్యాన్స్ లు  చేసేందుకు పోటీపడుతున్నారు. ఐశ్వర్యా రాయ్‌ రెగ్యులర్ హీరోయిన్ ఏజ్ దాటి చాలాకాలమైంది. అమ్మ అయ్యాక సినిమాలు కూడా తగ్గించింది. అయితే ఐష్‌ని అభిమానులు ఇప్పటికీ హీరోయిన్‌లానే చూస్తున్నారు. 47 ఏళ్ల వయసులోనూ అదే గ్లామర్‌ని మెయింటైన్‌ చేస్తోందని కామెంట్‌ చేస్తుంటారు. ఈ గ్లామర్‌తోనే ఫార్టీ ప్లస్‌లోనూ 'యే దిల్ హై ముష్కిల్' సినిమాలో లీడ్‌ రోల్ ప్లే చేసింది.

శిల్పా శెట్టి ఫిట్‌నెస్‌ లెవల్స్‌ చూసి బాలీవుడ్‌ హీరోయిన్స్‌ కూడా సర్‌ప్రైజ్ అవుతుంటారు. శిల్ప 46 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్‌గా ఎలా ఉందని డిస్కషన్లు పెడుతుంటారు. ఇంత ఏజ్‌లో కూడా శిల్పకి స్పెషల్‌ సాంగ్స్‌ ఎలా వస్తున్నాయని బాలీవుడ్‌ బ్యూటీస్‌ ఆశ్చర్యపోతుంటారు. అయితే ఫార్టీ ఫైవ్‌ ప్లస్‌లో కూడా గ్లామర్ చెక్కుచెదరకపోవడానికి యోగా కారణమంటుంది శిల్పా.హాలీవుడ్‌లో హీరోయిన్స్ ఏజ్‌తో సంబంధంలేకుండా కెరీర్‌ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. కానీ ఇండియన్ సినిమాలో మాత్రం హీరోయిన్స్‌కి ఏజ్‌తో పాటు ఇన్నింగ్స్‌ కూడా మారుతుంటుంది. కానీ కొంతమంది బాలీవుడ్‌ బ్యూటీస్‌ మాత్రం ఫార్టీ ఫైవ్‌ప్లస్‌లోనూ గ్లామర్‌ గిరీలో దూసుకెళ్తున్నారు. హాలీవుడ్‌ స్టైల్‌ని దింపేస్తున్నారు.

మాజీ మిస్‌ యూనివర్స్ సుస్మితా సేన్ 45 ఏళ్ల వయసులోనూ యంగ్‌ హీరోయిన్స్‌కి పోటీ ఇస్తోంది. ముఖ్యంగా సుస్మిత చేసే యోగాసనాలు చెయ్యడం చాలా కష్టమని మిగతా హీరోయిన్లు కూడా కామెంట్లు పెడుతుంటారు. ఈ యోగాతోనే ఇప్పటికీ బాలీవుడ్‌లో మెయిన్‌ రోల్స్‌ ప్లే చేస్తోంది సుస్మితా సేన్. మలైక అరోరా లవ్‌ స్టోరీ మాత్రమే కాదు, ఈమె ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ని కూడా జాగ్రత్తగా ఫాలో అవుతుంటారు బాలీవుడ్ జనాలు. 47ఏళ్ల వయసులో మలైక పెట్టే యోగా వీడియోస్‌కి లక్షల్లో లైక్స్ వస్తుంటాయి. పెళ్లి తర్వాత ఐపీయల్‌ ఈవెంట్స్‌లో తప్ప సినిమాల్లో కనిపించట్లేదు. కానీ డింపుల్ బ్యూటీ 46 ఏళ్ల వయసులోనూ హీరోయిన్‌లానే ఉందని కామెంట్లు పెడుతుంటారు అభిమానులు. అయితే ఈ గ్లామర్‌ని మెయింటైన్ చేసేందుకు  ప్రీతి చాలా కష్టపడుతుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: