టాలీవుడ్ మూవీలో విరాట్ కోహ్లీ అతిధి పాత్ర...?

VAMSI
సినిమాలలో ప్రత్యేక పాత్రలు వున్నాయి అంటే సాధారణంగా అటువంటి అవకాశాలు సినీ దిగ్గజాలకు వెళుతుంటాయి. ఒక భాష లోని స్టార్ హీరోలు మరో బాషలో ప్రత్యేక పాత్రలు చేయడం కూడా చూసే ఉంటాం. అయితే ఇపుడు వినిపిస్తున్న వార్త వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఆ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ న్యూస్ ఏమిటంటే..?? ఓ టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలో గెస్ట్ రోల్ కోసం స్టార్ క్రికెటర్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ స్టార్ క్రికెటర్ పేరు వింటే మనసు గాల్లో తేలుతూ ఉరకలు వేస్తుంది..అతడు మరెవరో కాదు ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను  ప్రేమ వివాహం చేసుకున్న విరాట్ ఇటు ఇండస్ట్రీకి కూడా చాలా దగ్గర బంధువయ్యారు. పలు యాడ్స్ లోనూ యాక్ట్ చేసి మెస్మరైజ్ చేశారు ఈ హ్యాండ్సమ్ క్రికెటర్. అయితే ఇపుడు నేరుగా ఓ సినిమాలో మన ముందుకు యాక్టర్ గా కనిపించడానికి వచ్చేస్తున్నారు అంటూ వార్తలు వినపడుతున్నాయి. అందులోనూ అది తెలుగు సినిమా అని తెలుస్తుండడం విశేషం. టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా చిత్రంలో విరాట్ ఒక స్పెషల్ రోల్ చేయబోతున్నారు అంటూ ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. పాత్ర నిడివి చాలా తక్కువేనని తెలుస్తోంది.

అయినా ఇంత పెద్ద క్రికిటర్ అందులోనూ కోట్లాదిమంది క్రికెట్ ప్రేమికుల  ప్రేమను గెలుచుకున్న స్టార్ క్రికెటర్ సినిమాలో కనిపించనున్నారు అంటే అది సాధారణమైన విషయం కాదు. ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉండే విరాట్సినిమా కోసం కేవలం కొన్ని గంటలు మాత్రమే వెచ్చిస్తే సరిపోతుందని రిక్వెస్ట్ చేయడంతో ఆయన సరే అన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ క్రికెటర్ విరాట్ తో పాత్రకు సంబందించిన వివరాలను చర్చిస్తున్నట్లు టాక్. మరి ఈ సినిమా ఎంటి..?? ఎంతవరకు కరెక్ట్..?? హీరో ఎవరు...అన్న వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: