ఫ్లాపుల్లో హీరోలు.. హ్యాట్రిక్ కాంబో లతో హిట్లు!!
మాస్ రాజా రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకునీ మళ్ళీ మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఆయన అంతకు ముందు వరుస ప్లాపులతో సతమతం అయిన విషయం తెలిసిందే. దాదాపు ఆయన కెరీర్ అయిపోయింది అనుకునే విధంగా భారీ ఫ్లాప్ లను మూట కట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన కు హిట్ పడాల్సిన నేపథ్యంలో ఈ క్రాక్ అనే సినిమా చేసి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో ఇప్పుడు ఆయనకు దాదాపు అరడజను సినిమా అవకాశాలు వచ్చాయి. వీటిలో ఏ రెండు సినిమాలు హిట్ అయినా కూడా ఆయనకు మంచి పేరు వస్తుంది. క్రాక్ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయగా వారిద్దరి కాంబినేషన్లో ఇది మూడో సినిమా కావడం విశేషం.
ఇక హ్యాట్రిక్ సినిమాగా బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అఖండ సినిమా. దీని కంటే ముందు భారీ ఫ్లాప్ల ను అందుకున్నాడు బాలకృష్ణ. ఆయనకు బోయపాటి శ్రీను తప్ప ఎవరూ కూడా మంచి విజయాన్ని అందించలేకపోతున్నారు అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో వారు చెప్పినట్లుగానే బోయపాటి శ్రీను అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోల తో హ్యాట్రిక్ సినిమాలు చేసిన దర్శకులు వారికి మంచి హిట్స్ ను అందజేయడం విశేషం. వారి కెరియర్ లో కూడా ఈ సినిమాలు స్పెషల్ సినిమాలు గా నిలిచాయి అని చెప్పవచ్చు.