మరో పొలిటికల్ గేమ్ తో రానా... డైరెక్టర్ ఎవరో చెప్మా?

VAMSI
సినీ రంగంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఏ విజయం ఎవరిని ఎక్కడికి చేరుస్తుందో అలాగే ఏ అపజయం ఎవరిని ఎక్కడికి తీసుకెళుతుందో ఎవరూ ఊహించలేం. సాధారణంగా ఫ్లాప్ వస్తే బడ్జెట్ పరంగానే కాదు ఆ హీరోకి దర్శకుడి కెరియర్ పై కూడా ఎంతో కొంత ప్రభావం పడుతుంది. అయితే కొందరు హీరోలు మాత్రం ఈ ఈక్వెషన్ కి భిన్నంగా దూసుకెళుతుంటారు. ఇదే తరహాలో దగ్గుబాటి రానా కూడా హిట్ ఫ్లాప్ అన్న తేడా లేకుండా కెరియర్ లో ముందుకెలుతుంటారు. ఇండస్ట్రీలో ఈయన రూట్ సెపరేటు వైవిధ్య భరిత కథలను ఎంచుకోవడంలో రానా ఎపుడు ముందుంటారు.

ఆ జోనర్ ఈ జోనర్ అని కొన్నిటికి మాత్రమే పరిమితం కాకుండా సరికొత్త కాన్సెప్టులను ఎంచుకుంటారు. ఇదే ఆయనకు ఇండస్ట్రీలో అరుదైన మరియు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారి పోయారు రానా. కాగా ఇటీవలే ఆయన నటించిన 'అరణ్య' సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మొదటి నుండి భారీ అంచనాల నడుమ హోరెత్తిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు రాబట్ట లేకపోయింది. దగ్గుబాటి రానా సినీ కెరీర్లో ఒక ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే..సినిమా అయితే సక్సెస్ ను అందుకోలేక పోయింది. కానీ హీరో రానాకి మాత్రం ఈ చిత్రం బాగా ప్లస్ అయ్యింది.

మరో విభిన్న పాత్రతో అరణ్య సినిమాలో కనిపించిన రానాకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. విమర్శకుల సైతం ఆయన నటనకు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు అదే రీతిలో ఒక కొత్త కాన్సెప్ట్ ను ఎంచుకున్నారట. ఈ చిత్రం పొలిటికల్ క్యాట్ అండ్ మౌస్ ను తలపిస్తుందని తెలుస్తోంది. ఈ కథకు కొత్త డైరెక్టర్ అయితే బాగుంటుందని సెర్చింగ్ లో ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: