"రాధేశ్యామ్" ప్రీ రిలీజ్ ఈవెంట్... స్టార్ హీరో ప్రమోషన్స్?
ఈ సినిమా సక్సెస్ బాటలో దూసుకుపోతుంది. కాగా ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'రాదేశ్యాం' జనవరి 14, 2022 న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ జోషును పెంచేందుకు పెద్ద యెత్తున సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గురువారం చాలా గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం టాలీవుడ్ స్టార్ హీరో , ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ హీరో అల్లు అర్జున్ రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం.
ఇప్పటికే పుష్ప మూవీ మంచి టాక్ తో దూసుకుపోతుండడంతో ఇది ఒక సక్సెస్ మీట్ గా కూడా ఉపయోగపడనుంది. ప్రమోషన్స్ లో బాగంగా బన్నీ ఈ ఈవెంట్ కి తన స్నేహితుడి కోసం వచ్చేస్తున్నారు అంటూ వార్తలు విపడుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. అయితే ఈ ఈవెంట్ లో ప్రభాస్ సినిమా గురించి ఏమైనా విషయాలు చెబుతారా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.