రాధే శ్యామ్ కు కృష్ణంరాజు నెగిటివ్ సెంటిమెంట్ ?

frame రాధే శ్యామ్ కు కృష్ణంరాజు నెగిటివ్ సెంటిమెంట్ ?

Seetha Sailaja

‘బాహుబలి’ తరువాత ప్రభాస్ కు నేషనల్ స్టార్ ఇమేజ్ ఏర్పడినప్పటికీ అతడికి ఆరేంజ్ బ్లాక్ బష్టర్ హిట్ ఇంకా దక్కలేదు. ‘సాహో’ పరాజయం తరువాత విడుదలకాబోతున్న ‘రాధే శ్యామ్’ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఏదో ఒక భయం ప్రభాస్ అభిమానులను ఈమూవీ పై వెంటాడుతూనే ఉంది. ఈమూవీకి సంబంధించిన భయాలను పోగొట్టడానికి ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అత్యంత ఘనంగా రామోజీ ఫిలిం సిటీలో ఈవారం ఏర్పాటు చేస్తున్నప్పటికీ లేటెస్ట్ గా ఈమూవీకి కృష్ణంరాజు నెగిటివ్ సెంటిమెంట్ అవుతాడా అంటూ అభిమానులలో కొత్త భయాలు మొదలయ్యాయి.

కృష్ణంరాజు వారసుడుగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన నాటినుండి ఎన్నో హిట్స్ సినిమాలలో నటించినప్పటికీ కృష్ణంరాజు ప్రభాస్ తో ఒక సరైన బ్లాక్ బష్టర్ హిట్ సినిమాలో నటించలేకపోయాను అన్న అసంతృప్తి కృష్ణంరాజుకు ఉంది. దీనితో ‘రాథే శ్యామ్’ మూవీలోని కీలక పాత్ర అయిన పరమహంస పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నాడు. కొన్ని అదృశ్య శక్తులు కలిగిన ఒక యోగి పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నాడు.

లేటెస్ట్ గా ఈమూవీలోని కృష్ణంరాజు పరమహంస లుక్ ను విడుదల చేసారు. అయితే ఆ లుక్ అంత బాగా లేదు అన్న కామెంట్స్ రావడంతో ప్రభాస్ అభిమానులకు కొత్త భయాలు మొదలయ్యాయి. గతంలో కృష్ణంరాజు ప్రభాస్ కలిసి నటించిన ‘బిల్లా’ ‘రెబల్’ సినిమాలు రెండు ఫ్లాప్ అయ్యాయి. దీనితో పరోక్షంగా ఈఫ్లాప్ సెంటిమెంట్ ‘రాథే శ్యామ్’ పై ప్రభావం చూపెడుతుందా అన్నభయాలు ఇప్పుడు ప్రభాస్ అభిమానులను భయపెడుతున్నట్లు టాక్.

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి విడుదలైన పాటల ట్యూన్స్ అన్నీ హిందీ పాటల ట్యూన్స్ లా ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు ఈమూవీ ట్రాజడీ అన్న ప్రచారం కూడ జరుగుతోంది. ఇన్ని నెగిటివ్ వార్తలు మధ్య ఈమూవీ విడుదల అవుతూ ఉండటంతో పాటు ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియా మధ్య ఈమూవీ విడుదల అవుతున్న పరిస్థితులలో ఈమూవీ ఫలితంలో కూడ తేడా వస్తే ప్రభాస్ ఇమేజ్ పై తీవ్ర ప్రభావం చూపెడుతుంది అంటూ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: