
మానస్ ని సన్నీ మోసం చేసాడట..తెర పైకి షాకింగ్ మ్యాటర్..?
మొదటి నుండి అమ్మ సెంటిమెంట్ తో అభిమానులకు దగ్గరైన సన్నీ..ఆ తరువాత ఆట ఆడుతూ...ఫ్రెండ్ షిప్ కి విలువ ఇస్తూ..తనదైన స్టైల్లో బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరై ఫైనల్ కి కప్ గెలిచి అమ్మ మాట నిలబెట్టాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ బిగ్ బాస్ లో సన్నీ కప్ గెలవడానికి బయట నుండి అభిమానులు ఓటింగ్ ద్వారా హెల్ప్ చేస్తే..లొపల ఉన్న కాజల్, మానస్..సన్నీకి మరింత బూస్టప్ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ ద్వారా సన్నీ-మానస్ మంచి ప్రెండ్స్ అయిన విషయం తెలిసిందే.
అయితే సన్నీ కప్ విన్ అవ్వడం పట్ల పలువురు మానస్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కప్ గెలిచే అర్హత హౌస్ లో మానస్ కి మాత్రమే ఉంది అంటూ చెప్పుతున్నారు. సన్నీ, ఫ్రెండ్ షిప్ పేరుతో మానస్ ని పూర్తిగా వాడుకున్నాడు అంటూ మండిపడుతున్నారు. సీజన్ మొత్తం మీరు చూసిన్నట్లైతే సన్నీకి మానస్ ఎంతో హెల్ప్ చేసాడు..కానీ సన్నీ మానస్ కి ఏం చేయలేదు ..బిగ్ బాస్ అంటే ఆట ఒక్కటే కాదు..అన్నీ ఎమోషన్స్ కూడా పండించాలి అంటూ మానస్ ఒక్కడే హౌస్ లో నిజాయితీ గా ఆట ఆడారు అంటూ చెప్పుకొస్తున్నారు. సన్నీ కప్ గెలవచ్చు కానీ మానస్ మా ప్రేమాభిమానాలు గెలిచి రియల్ విన్నర్ గా నిలిచాడు అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాని వ్యక్తం చేస్తున్నారు.