యాంకర్ రష్మికి ప్రమోషన్.. ఇక తిరుగు లేదు?

praveen
జబర్దస్త్ యాంకర్ రష్మీ కి బుల్లితెరపై ప్రత్యేకమైన క్రేజ్ వుంది ఒకప్పుడు సినిమాల్లో చిన్నాచితక పాత్రలు చేసి ఎక్కడో మూలన కనిపించే రష్మీ ఇక జబర్దస్త్ అనే కార్యక్రమంలో యాంకర్ గా ప్రత్యక్షమయ్యి తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలిగా మారిపోయింది.. ఇక తెలుగు రాకపోయినప్పటికీ ఎంతో కష్టంగా తనదైన శైలిలో తెలుగులో యాంకరింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. జబర్దస్త్ స్టేజ్ పై పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ తన అందంతో కూడా ఆకట్టుకుంది రష్మీ. తక్కువ సమయంలోనే గుర్తింపు సంపాదించుకుంది అని చెప్పాలి.

అయితే రష్మీ జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతున్న సమయంలోనే.. అనసూయ మళ్ళీ జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇక జబర్దస్త్ యాంకర్ గా ఎవరిని కొనసాగిస్తారా అని చర్చ జరుగుతున్న సమయంలో ఈ టివి నిర్వాహకులు వినూత్నమైన ప్లాన్ చేశారు   జబర్దస్త్ కు కొనసాగింపుగా ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇక జబర్దస్త్ లో యాంకర్ అనసూయ తన వాక్చాతుర్యంతో ఆకట్టుకోగా ఎక్స్ ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకరింగ్ తో అదరగొట్టింది. ఇక ఎన్నో రోజుల నుంచి ఇద్దరు యాంకర్లు జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలలో ఆకట్టుకుంటున్నారు.

 అయితే ప్రస్తుతం చూస్తే ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీ కి ప్రమోషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మొన్నటి వరకు కేవలం ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కనిపించిన రష్మి ఇప్పుడు జబర్దస్త్ లో కూడా యాంకరింగ్ చేస్తూ ప్రత్యక్షం కావడం గమనార్హం. ఇటీవలే విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో యాంకర్ రష్మి కనిపించింది. దీంతో అనసూయని జబర్దస్త్ నుంచి తీసేశారా.. లేక షూటింగ్  కారణంగా అనసూయ దూరం కావడంతో కొన్నాళ్లపాటు రష్మి ని కొనసాగిస్తారా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.  రష్మి కి ప్రమోషన్ ఇచ్చారు అంటూ మరికొంతమంది కూడా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: