షన్ను చాలా స్పెషల్.. అతను ఎప్పుడంటే అప్పుడే పెళ్లి : సిరి
అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత సిరి ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నప్పటికీ అటు షణ్ముఖ్ తో స్నేహం వళ్ళ మాత్రం కాస్త నెగిటివిటీ కూడా సంపాదించుకుంది. మేమిద్దరం మంచి స్నేహితులం అంటూ బిగ్ బాస్ హౌస్ లో చెప్పే వీరిద్దరూ తరచూ హగ్గులు, కిస్సులతో రెచ్చిపోవడంతో అటు బిగ్బాస్ ప్రేక్షకులందరికీ కాస్త చిరాకు పుట్టింది అని చెప్పాలి. ఇక టైటిల్ రేసులో ఉన్న షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ చేర్చుకోవడానికి ఇది కూడా ఒక కారణం అంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల బిగ్బాస్ కార్యక్రమము ముగియడంతో బయటికి వచ్చిన తర్వాత తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై స్పందించింది సిరి.
బయటికి వచ్చిన తర్వాత యూట్యూబ్ లో వచ్చిన థంబ్ నైల్స్, వీడియోలు సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్లు చూసి షాక్ అయ్యాను. షణ్ముఖ్ జస్వంత్ నాకు చాలా మంచి ఫ్రెండ్. నా లైఫ్ లోనే తను చాలా స్పెషల్. బిగ్ బాస్ హౌస్ లో ఎంత నిజాయితీగా ఉన్నామో.. బయటకి వచ్చాక కూడా మేము అలాగే ఉంటాము. కానీ షణ్ముఖ్ జస్వంత్ ను హగ్ చేసుకోవటం బయట సరిగ్గా రిసీవ్ చేసుకో లేదు అన్నది అర్థమైంది అంటూ సిరి చెప్పుకొచ్చింది. అయితే మా పర్సనల్ లైఫ్ గురించి ఇద్దరికీ క్లారిటీ ఉందని చెప్పిన సిరి.. తన ప్రియుడు శ్రీహన్ తో పెళ్లి గురించి మాట్లాడుతూ శ్రీహాన్ ఎప్పుడు అంటే అప్పుడే మా పెళ్లి అంటూ చెప్పుకొచ్చింది సిరి.