వరుణ్ తేజ్ సైలెంట్ కి కారణం ఏంటంటే?

P.Nishanth Kumar
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం గని అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అల్లు బాబీ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు అని చెప్పవచ్చు. వరుస విజయాలతో స్టార్ హీరోగా ముందుకు దూసుకుపోతున్న వరుణ్ ఈ చిత్రం తోనూ విజయాన్ని సాధించి తన సక్సెస్ ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. మెగా హీరోగా సినిమా పరిశ్రమలోకి వచ్చినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకొని ఇప్పుడు వరుస సినిమా అవకాశాలను సంపాదించుకుంటున్నాడు. 

ముకుంద సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి విజయాలు సాధించి ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే సక్సెస్ ను సస్టైన్ చేసుకోవడానికి మాత్రం ఆయన కొంత సమయం తీసుకున్నాడు అని చెప్పవచ్చు. కొన్ని భారీ ఫ్లాపులు వచ్చిన తర్వాత ఆయన సినిమాల పట్ల ప్రత్యేకమైన కేర్ తీసుకుని సినిమాలు చేయడం వల్ల ఇప్పుడు వరుస సక్సెస్ లు సాధిస్తున్నాడు. ఇప్పుడు ఆయన చేసిన గత ఆరు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యి ఆయనకు మంచి పేరును తీసుకువచ్చాయి. 

ఇక ఆయన నటించిన గత చిత్రం గద్దల కొండ గణేష్ సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గద్దల కొండ గణేష్ సినిమాలో రౌడీ షీటర్ గా నటించిన వరుణ్ ఆ పాత్రకు న్యాయం చేసి నటుడిగా కూడా తనని తాను సంతృప్తి పరచుచుకున్నాడు. ఆ విధంగా ప్రస్తుతం చేస్తున్న గని చిత్రం ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఇతర సినిమాలకు పోటీగా రావడం ఇష్టంలేక సోలోగా రావాలనే ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధం చేశారు. కిరణ్ కొర్రపాటి అనే ఓ నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: