పులిని చూసి వాత పెట్టుకోవడం అంటే ఇదే!!
బాలకృష్ణ హీరో గా నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం నందమూరి బాలకృష్ణ అద్వితీయ నటన కలగలిపి ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని మంచి కలెక్షన్లను సైతం రాబట్టుకుని తన ఖాతాలో వేసుకుంది. ఆ విధంగా బోయపాటి శ్రీను దర్శకత్వం యొక్క ప్రతిభ నందమూరి బాలకృష్ణ ను ఆయన స్క్రీన్ పై చూపించిన విధానం ఆయన తో పలికించిన డైలాగులు ఆయనకు ఇచ్చిన ఎలివేషన్స్ అన్ని కలగలిపి ఈ సినిమా ఇంత అంత పెద్ద విజయం సాధించడానికి కారణాలు అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఈ సినిమా చూసి చాలా సినిమాలు సినిమాలు అదే విధంగా ఎలివేషన్ ఇవ్వాలని చెప్పి రీ షూట్స్ చేసుకుంటున్నారు. అలా చిరంజీవి ఆచార్య సినిమాను కూడా రీ షూట్ చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. అఖండ సినిమా విడుదల కాకముందు తమ సినిమా పట్ల ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది ఆచార్య చిత్ర బృందం. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ నిర్మాత దర్శకుడు ఈ సినిమాలోని కొన్ని సీన్స్ రీ షూట్ చేయాలని భావించారు. దాంతో వారు రీ షూట్ చేయక తప్పడం లేదు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం ఫిబ్రవరి లో సినిమా ను విడుదల చేయడం కష్టం అంటున్నారు.