వామ్మో.. బిగ్బాస్ ప్రియాంక ఏంటి ఇలా మారిపోయింది?
ఈ క్రమంలోనే ఇప్పటికే వివిధ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిని కూడా స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్ అనే కార్యక్రమంలో చేర్చింది. ఒకప్పుడు జబర్దస్త్ లో ఎంతగానో కామెడీ చేసి అలరించిన అవినాష్ ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి బయటికి వచ్చిన తర్వాత చివరికి మా టీవీలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ అనే కార్యక్రమంలో చేస్తూ ఉండటం గమనార్హం.. ఇక ఇటీవలే బిగ్బాస్ ఐదో సీజన్లో హౌస్ లోకి వెళ్లిఎన్నో రోజుల పాటు కొనసాగింది ప్రియాంక సింగ్. అప్పుడు జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక సింగ్ ఇక ఇప్పుడు బిగ్బాస్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.
ఇటీవలే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ప్రియాంక సింగ్ మల్లి జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ అనుకోని విధంగా జబర్దస్త్ లోకి కాకుండా ఏకంగా స్టార్ మా లో ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక. ఇటీవలే కామెడీ స్టార్ కు సంబంధించి విడుదలైన ప్రోమో లో కనిపించింది. అయితే ఇక ప్రియాంక గెటప్ మొత్తం మార్చేసింది అనే చెప్పాలి. ఏకంగా ఎంతో అందంగా ఉన్న తన హెయిర్ మొత్తం కలర్ కలర్ గా మార్చుకుంది. అయితే ఇది నిజంగా కాదులెండి.. కేవలం స్కిట్ లో భాగంగానే కాస్త వింత గెటప్ వేసుకొని కనిపించింది ప్రియాంక సింగ్. ప్రియాంకను చూసి ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతున్నారు. మొన్నటివరకు బిగ్బాస్ లో ఎంతో అందంగా కనిపించినా ప్రియాంక ఇలా మారిపోయింది ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.