టాలీవుడ్ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన క్రమశిక్షణకు మారుపేరు. మోహన్ బాబు అంటే ఇండస్ట్రీలో చాలామందికి భయం కూడా. ఎందుకంటే ఆయన లోపల ఏదీ దాచుకోకుండా సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తారు.ఇక ఆయనకు కోపం వస్తే.. భయపడకుండా ఉన్నది ఉన్నట్టు బయటకు కక్కేస్తారు. అందుకే చాలామంది మోహన్‌బాబుతో గొడవలు పెట్టుకునే విషయంలో వెనకడుగు వేస్తారు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మోహన్ బాబు విలన్ గా, హీరోగా, నిర్మాతగా ఇలా ఎన్నో రకాల రోల్స్‌తో ఇండస్ట్రీలో తనదైన పాత్ర పోషిస్తు తనకంటూ గొప్ప ఇమేజ్ ఏర్పరచుకున్నాడు.రాజకీయం పరంగా కూడా మోహన్ బాబుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పలుకుబడి అనేది ఉంది.ఇక దర్శకధీరుడు జక్కన్న రాజమౌళి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. రాజమౌళితో జీవిత కాలంలో ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతో మంది స్టార్ హీరోలు కూడా కలలుకంటూ ఉంటారు.ఇక రాజమౌళిని తన పెద్ద కుమారుడు మంచు విష్ణు కోసం ఒక సినిమా చేసి పెట్టమని గతంలో మోహన్‌బాబు ఆయన్ని అడిగారట. ఆ టైంలో రాజమౌళి సై - సింహాద్రి - విక్రమార్కుడు - ఛత్రపతి - యమదొంగ లాంటి సూపర్ హిట్ సినిమాలతో ఫుల్ ఫాంలో దూసుకుపోతున్నారు.అప్పుడు రాజమౌళితో మంచు విష్ణుకు ఒక హిట్ సినిమా పెడితే విష్ణు కెరీర్ కొంచెం మారిపోతుంది అని మోహన్ బాబు భావించి ఉండవచ్చు. అయితే దర్శకధీరుడు రాజమౌళి మాత్రం విష్ణుతో సినిమా చేసే టైం వస్తే తప్పక సినిమా చేస్తానని చెప్పాడు. అయితే ఇప్పుడు ఏదో ఒక కథతో విష్ణుతో సినిమా చేయడం తనకు ఇష్టం లేదని మోహన్ బాబుతో రాజమౌళి అన్నారట.అప్పుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇండస్ట్రీలో తాను ఏమడిగినా ఎవరు ఏమి కాదనలేరు అని. తన కొడుకు కోసం ఒక సినిమా చేసి పెట్టమని అడిగితే మన రాజమౌళి కుదరదు అని చెప్పటంతో ఆయన కొంచెం ఫీల్ అవ్వడం జరిగిందట. ఇక అప్పట్నుంచి ఇద్దరి మధ్య దూరం పెరిగింది.