
ఏపీలో అది జరిగే పనికాదు.. సినిమా వాళ్లు ఆ మాట మర్చిపోవడమే...?
సినిమా ప్రముఖులు కొందరు ఇటీవల ఓ నాలుగైదు సార్లు ఏపీలో పర్యటించి ముఖ్యమంత్రి జగన్ తో పాటు మంత్రులను కలిసి వస్తున్నారు. అయితే వీరికి ఇచ్చిన హామీలు ఏవీ కూడా నెరవేరటం లేదు. ఇక గత కొంతకాలంగా సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు వ్యవహారం కూడా తీవ్రమైన కలకలం రేపుతోంది. చివరకు థియేటర్ల ఓనర్లు హైకోర్టుకు వెళ్లి మరి రేట్లు పెంచుకునేందుకు అనుమతి తీసుకోవాల్సి వచ్చింది.
అయితే డివిజన్ బెంచి ఇచ్చిన తీర్పు రేట్ల పెంపు అంశాన్ని జాయింట్ కలెక్టర్ అనుమతితోనే చేసుకోవాలని కూడా చెప్పింది. అయితే ఏపీ హోం శాఖ కార్యదర్శి మాత్రం దీనిపై స్పందిస్తూ ఇంకా జీవో 35 అమల్లోనే ఉందని ... డివిజన్ బెంచ్ ఆదేశాలు ఈ విషయంలో ఎవరైతే కోర్టుకు వెళతారో వారికి మాత్రమే వర్తిస్తాయని చెప్పారు.
ప్రభుత్వం థియేటర్ల విషయంలో ఎందుకింత కఠిన వైఖరి తో ఉంటోంది అన్నదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి సినీ పరిశ్రమ వెళ్లడం అనేది కలలో పనిగా తెలుస్తోంది. మరో వైపు తెలంగాణ సర్కారు మాత్రం తెలంగాణ లో సినీ పరిశ్రమ అభివృద్ధే చెందే విషయంలో అన్నీ సౌకర్యాలు ఇండస్ట్రీ వాళ్లకు ఇస్తోంది.
ఇక రేట్లు పెంచుకునే విషయంలో ఎడా పెడా అనుమతులు ఇస్తోంది. కావాల్సినన్ని షోలు కూడా వేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం తీరును తెలంగాణ ఎంచక్కా సద్విని యోగం చేసుకుంటోంది. ఏదేమైనా అసలు ఏపీ లో సినీ రంగంలో పెట్టుబడులు పెట్టడం అనేది ఇప్పట్లో జరిగే పని కాదనే అర్థమైపోతోంది.