ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న సీనియర్ హీరోయిన్..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ త్రిష నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, లాంటి సినిమా లతో తెలుగు నాట ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది,  ఆ తర్వాత కూడా త్రిష వరుస సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత కూడా తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇలా తెలుగు నాట లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రిష తన ఫుల్ ఫోకస్ ను తమిళ ఇండస్ట్రీ మీద పెట్టింది, కోలీవుడ్ లో కూడా ఎక్కువగా త్రిష లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి ని చూపిస్తోంది.


 అయితే కోలీవుడ్ లో పర్వాలేదు అనే రేంజ్ లో తన హవాను కొనసాగిస్తున్న ఈ హాట్ బ్యూటీ కి తెలుగు లో మాత్రం అవకాశాలు రావడం లేదు, చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న ఆచార్య సినిమాలో  ఈ ముద్దు గుమ్మ నటించాలి కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ త్రిష చేతి నుండి వెళ్ళిపోయింది. సీనియర్ హీరో లకు త్రిష పర్ఫెక్ట్ జోడి, ఫర్ఫెక్ట్ సినిమా పడితే ఇంకా కూడా తెలుగులో తన హవాను చాటే అవకాశం త్రిష కు ఉంది కానీ త్రిష కు ఒక్క అవకాశం కూడా రావడం లేదు. ఆ అవకాశం కోసం హాట్ బ్యూటీ త్రిష ఆతృతగా ఎదురు చూస్తోందట. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం త్రిష మణిరత్నం దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ సినిమా లో ఒక ప్రధాన పాత్రలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: