రాజమౌళికి కాంపిటీషన్ బాగా పెరుగుతుంది!!

P.Nishanth Kumar
దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో కూడా కలలుకంటూ ఉంటారు. సీనియర్ హీరో ల దగ్గర నుంచి యంగ్ హీరోల దాకా ఆయన తో సినిమాలు చేయాలని అనుకుంటారు కానీ రాజమౌళి సినిమాలు చేయడంలో చాలా నెమ్మది అన్న విషయం అందరికి తెలిసిం దే. ఎందుకంటే ఆయన ఒక సినిమాకు దాదాపు మూడేళ్ల సమయం తీసుకోవడం వల్ల అందరి హీరోలతో ఆయన సినిమాలు చేయలేకపోతున్నారు. అయితే మూడేళ్లకు ఒకసారి చేసినా కూడా రికార్డ్ క్రియేట్ చేసే విధంగా హీరోలు రాజమౌళితో ఎలాగైనా సినిమాలు చేయాలని భావిస్తూ ఉండడం విశేషం. 

ఈ నేపథ్యంలోనే ఆయన ప్రస్తుతం తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం తర్వాత ఆయన తెరకెక్కించే సినిమా పై అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది. కొంతమంది మహేష్ బాబు తో ఆయన తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు అని చెబుతుండగా ఇంకొంతమం ది రాజమౌళి మహేష్ కాదు మరో హీరోతో సినిమా చేస్తున్నాడని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దాంతో జక్కన్న ఎవరితో సినిమా చేస్తున్నాడనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. 

అయితే తమతో సినిమా చేయమంటూ కొంతమంది హీరోలు రాజమౌళి నీ రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ షో లో రాజమౌళి ఇటీవల పాల్గొనగా తన తో సినిమా చేయవలసిందిగా బాలకృష్ణ కోరుతున్నాడు. అంతేకాదు అల్లు అర్జున్ కూడా తనతో సినిమా చేయాల ని ఆయనను కోరారు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఎవరితో సినిమా చేస్తున్నాడు అన్న విషయం ఎప్పుడూ ఎంతో ఆసక్తికరంగా మారింది టాలీవుడ్ సిని మా పరిశ్రమలో. ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: