సమంతకి విడాకులిచ్చి చైతు మంచి పని చేశాడంటోన్న నెటిజన్లు..!

N.ANJI
లెక్కల మాస్టరు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో సమంత ఐటమ్‌లో నటించారు. ప్రస్తుతం ఆమె నటించిన ఆ పాట యూట్యూబ్ సంచలనం సృష్టిస్తుంది. అంతేకాదు.. ఈ పాట యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఇక ఇప్పటికే ఈ పాటకు 25 మిలియన్‌లకు పైగా వ్యూస్ వచ్చాయి అంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడాకుల తర్వాత హాట్ హాట్‌గా తెరమీద కనిపించడంతో పాటు.. అల్లు అర్జున్‌తో హాట్ హాట్‌గా రొమాన్స్ చేయడం చూస్తుంటే ఆమె భర్తతో విడిపోయాక తెగించినట్టే కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

పుష్ప సినిమాలో ఆమె నటించిన ఐటమ్ సాంగ్‌పై రోజురోజుకూ సోషల్ మీడియాలో మాత్రం పూర్తిగా కాంట్రవర్సీ జరుగుతుంది. ఇక ఈ పాటలో మీ మగ బుద్దే వంకర బుద్ధి అన్న పదాలు పురుషుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ పురుష సమాజం సమంతపై  విమర్శలు చేస్తున్నారు. మరికొంత మంది ఐటెం సాంగ్‌లో ఆమె ఎందుకు నటించాలని పలువురు సోషల్ మీడియాలో ట్రోల్ పెడుతున్నారు. అయితే తాజాగా ఏపీ పురుషుల సంఘం ఈ సాంగ్‌ను నిషేధించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పాట తాజాగా మగవారిపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఉందని.. దీనిని వెంటనే సినిమాలో నుంచి తీసేయాలని వారు డిమాండ్ చేశారు.

కాగా.. ఈ సినిమా అల్లు అర్జున్‌కి, సుకుమార్‌కు ప్లస్ అయ్యేలా ఉన్నప్పటికి సమంతకి మాత్రం ఇది రోజు రోజుకు మైనస్ అవుతోందనే చెప్పాలి మరి. ఈ పాటకు సంబంధించిన ప్రోమో వచ్చాక చాలా మంది నెటిజన్లు సమంత వేషం, ఆమె డ్యాన్స్ చేసిన తీరు చూసి ఆమెను ఆడుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సమంత ఈ ఐటెం సాంగ్ చేసిన విధానం చూస్తుంటే ఆమెకు పెళ్లయ్యిందా ? అన్న విషయం కూడా మర్చిపోయిందని.. మొత్తానికి చైతు విడాకులు ఇచ్చి చాలా మంచి పనిచేశాడని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: