పుష్ప : కొంచెమైనా గ్యాపివ్వు సామీ! ఏందా లవ్వు !

RATNA KISHORE
పుష్ప ద రైజ్ సినిమా ఇవాళ విడుద‌ల‌యింది. అన్ని సెంట‌ర్ల‌లో మంచి టాక్ వ‌స్తోంది. తెలంగాణ‌లో ఐదు షోల‌కు అనుమ‌తి ద‌క్క‌డం మ‌రో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ. సినిమాకు వెచ్చించిన మూడేళ్ల కాలం కూడా అద‌న‌పు ఆక‌ర్ష‌ణే.. ఈ సినిమాకు పెట్టిన ఎఫెర్ట్ కారణంగా అంతా రిజ‌ల్ట్ తో సంబంధం లేకుండానే మాట్లాడుతున్నారు. ఒన్లీ బ‌న్నీ అన్న‌ది ఇప్పుడు వినిపిస్తున్న మాట.. అత‌డు మాత్ర‌మే అన్న‌ది ఇంట‌స్ట్రీ నుంచి వ‌స్తున్న అప్లాజ్.. ఆయ‌న క‌ష్టం ఫ‌లితం అన్న‌వి రెండూ కూడా ఈ  సినిమా నుంచి మారిపోతాయి అవును ఇంకొంచెం పై స్థాయిలో చేయ‌ద‌గ్గ‌ సినిమాల‌కు ఈ సినిమా రిఫ‌రెన్స్ అవుతుంది.



పేరు డ‌బ్బు రెండూ వ‌స్తాయి ఈ సినిమాతో అని బ‌న్నీ అన్న‌ది ఇందుకే! పేరు డ‌బ్బుతో పాటు ప్రేమ కూడా వ‌స్తుంది ఈ  సినిమాతోనే మీతోటే మీ వెంటే అంత గొప్ప‌గా ఈ సినిమాలో బ‌న్నీ స్క్రీన్ ట్రాన్స‌ఫ‌ర్మేష‌న్ ఉంది. సినిమా అంటే ప్రేమ ఉంటే ఏమ‌యినా సాధ్య‌మే ఇలాంటి అద్భుతాల‌కు అదృష్టంతో ప‌ని లేదు కేవలం కృషి పైనే ఇవి ఆధారం..

ఒక సినిమా జీవితాన్ని మారుస్తుంది.. ఒక సినిమా ఆలోచ‌న‌కు కొత్త శ‌క్తిని అందిస్తుంది. ఒక సినిమా కొత్త ప్ర‌పంచానికి ద్వారం తెరుస్తుంది.. కొత్త ఇంటి నిర్మాణంలాంటిదే ఓ సినిమా.. మ‌నం నిర్మాణాన్ని ప్రేమిస్తూ ఉంటే కొత్త శైలి కొత్త రూపం కొత్తందం అన్నవి క‌లిసి వ‌స్తాయి.  ఒక సినిమా కార‌ణంగా కొత్త త‌రం వ‌స్తుంది..లేదా పాత త‌రం నుంచి వ‌చ్చిన కొత్త ఆలోచన మ‌రో ఏడాది పాటు మ‌రో రెండేళ్ల పాటు మంచి సినిమా నిర్మాణానికి సాయం అందిస్తుంది. ఇప్పుడు సినిమా స్పాన్ పెరిగింది. ఇప్పుడు సినిమాకు  ఉన్న ఆలోచ‌న తెగువ సాహ‌సం అన్న‌వి కూడా పెరిగాయి. ఆ విధంగా ప్యాన్ ఇండియా అన్న కాన్సెప్ట్ మేలు చేస్తోంది. బ‌న్నీ లాంటి హీరోల‌కు కొత్త జీవితాన్ని ఇస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: