పుష్ప: మెగాస్టార్ అన్న ఆ మాట.. సినిమాకు కలిసొస్తుందా..?

Divya
 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-రష్మిక కలయికలో వస్తున్న మొదటి తాజా చిత్రం.. పుష్ప. ఈ సినిమాని లెక్కల మాస్టర్ అయినటువంటి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రేపటిరోజున ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక ఈ సినిమా కష్టం కేవలం ఆ చిత్ర యూనిట్ సభ్యులకు మాత్రమే తెలుసు. ఇక ప్రమోషన్లలో కూడా ఈ సినిమా గురించి చెప్పడం జరిగింది. ఇక మేకప్ కోసం అయితే ఏకంగా కొన్ని గంటల సమయమే పట్టిందట. ఎలాగంటే ఉదయం 4కే లేచి వెళితే ఐదు గంటలకి సెట్ లో ఉండేవారట.. ఇక ఆ తరువాత అప్పటి నుంచి 7 గంటల వరకు మేకప్ వేసుకోవడానికే సమయం పడుతుందట.

అలా వేసిన మేకప్ లు తీయడానికి దాదాపుగా ఒక గంట సేపు సమయం పడుతుందట. ఇక ఈ పాత్ర ను చూపించడానికి మేకప్ బాయ్స్ చాలా కష్ట పడినట్లు సమాచారం. ఇక కేవలం మొహానికి కాకుండా.. మొత్తం శరీరానికి కూడా కొంతమంది కొన్ని సీన్లలో మేకప్ వేసుకున్నట్లు తెలియజేశారు అల్లు అర్జున్. ఎంతో ఎఫెక్టివ్గా కనిపించేందుకు నేచురల్ నేపథ్యంలో ఈ సినిమాలో నటించానని తెలియజేశారు అల్లు అర్జున్. అయితే చిరంజీవి తన ట్విట్టర్ నుంచి డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక.. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
మీరందరూ ఈ సినిమాకి ఎంతో చెమట చిందించి, నిబంధనలతో పనిచేశారు, మీరు కష్టపడిన ఫలితం అంతా ఈ సినిమాలో కనిపిస్తుందని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ కోసం ఎక్కడో ఉన్న దూర ప్రాంతాలకు కూడా వెళ్లారట. ఒకసారి అడవిలో షూటింగ్ కోసం వీరే స్వయంగా రోడ్లు వేసుకున్నారట. ఇక కేవలం రాత్రి లోపే రోడ్లు వేసి వెహికల్స్ వెళ్లడానికి చాలా కష్టపడ్డాం అన్నట్లు తెలియజేశారు చిత్ర బృందం. ఇదంతా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: