బాలకృష్ణ : కథ కుదిరితే మల్టిస్టారర్..!
అఖండ చిత్రం విజయం సాధించడంతో సినీ పరిశ్రమకు ఒక ధైర్యము వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఘన విజయం సాధించటం పట్ల చాలా ఆనందంగా ఉన్నదని తెలిపారు బాలకృష్ణ. సనాతన ధర్మాన్ని చూపించిన సినిమా అఖండ అని.. విజవాడ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో ప్రేక్షకులు ఘన విజయం అందించారు అని చెప్పారు. చాలా రోజుల తరువాత సినిమా ప్రేక్షకులందరూ కలిసి సకుటుంబ సమేతంగా థియేటర్లకు రప్పించిన సినిమా అఖండ అని వెల్లడించారు.
అంతుకు ముందు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నందమూరి హీరో బాలకృష్ణకు, అఖండ చిత్ర బృందానికి బొర్రా గాంధీ, కరుణాకర్ బృందం స్వాగతం పలికారు. ఆ తరువాత రోడ్డు మార్గంలో అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరారు. ఈ తరుణంలో బాలయ్యతో పలువురు అభిమానులు సెల్పీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇక అక్కడి నుంచి నేరుగా విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అఖండ చిత్ర బృందం. ఇంద్రకిలాద్రి నుంచి వెళ్లి మంగళగిరిలోని పానకాల లక్ష్మీనరసింహాస్వామిని అఖండ చిత్ర బృందం దర్శించుకున్నది.