మనోడు అక్కడ ఇరగదీసేలా ఉన్నాడే!!

P.Nishanth Kumar
తెలుగు లోని కొంత మంది నటీనటులు తమిళ సినిమా పరిశ్రమలో నటిస్తుండటం మనం సహజంగా చూస్తూనే ఉంటాం. అలాగే తమిళ నటులు కూడా తెలుగు లో నటిస్తుంటారు. అయితే హీరోలు-హీరోలు గా హీరోయిన్ హీరోయిన్ గా ఆర్టిస్ట్ లు క్యారక్టర్ ఆర్టిస్ట్ లు గా మాత్రమే ఇప్పటివరకు నటిస్తూ వచ్చారు. కానీ తొలిసారిగా తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా భారీ గా ఎస్టాబ్లిష్ అయి ఆ తర్వాత మంచి మార్కెట్ ఏర్పరుచుకున్న హీరో ఇప్పుడు తమిళనాడులో ఓ పెద్ద హీరో సినిమా లో విలన్ గా నటించడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఈ పాటికే మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో మీకు అర్ధమయ్యే ఉంటుంది.

తెలుగు సినిమాల్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించి హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో కార్తికేయ. ఆయన నటించిన తొలి చిత్రం ఆర్ఎక్స్100 సెన్సేషన్ క్రియేట్ చేసే విధంగా విజయాన్ని సాధించుకోగా అది ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఆయన తెలుగులో సినిమాలు చేసుకుంటూ కొన్ని ప్రయోగాలు కూడా చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంలో ఆయన విలన్ గా నటించడం మాత్రమే కాకుండా ఇప్పుడు తమిళంలోనూ విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

అజిత్ హీరోగా నటించిన వాలిమై సినిమా తో విలన్ గా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వీడియో ఒకటి విడుదల అయ్యింది. ఈ వీడియోలో కార్తికేయ ను చూస్తుంటే ఆయనకు ఎలివేషన్ బాగానే  చిత్రబృందం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా లో అజిత్ కన్నా కార్తికేయ పాత్ర హైలెట్ అవుతుందని కూడా చెబుతున్నారు. శరీరంపై టాటూలు చూస్తుంటే ఎలివేషన్ ఎక్కువగానే ఆయనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అంతేకాదు వావ్ అనిపించేలా కొన్ని కొన్ని సీన్స్ కూడా ఆయన చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఈ పాత్ర కార్తికేయ కు భవిష్యత్తులో ఏ విధంగా తన కెరియర్ కు ఉపయోగపడుతుందో చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: