పుష్ప ఐదు షోలు.. నైజాంలో ఫస్ట్ డే టార్గెట్ ఫిక్స్..!

shami
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాకు నైజాం లో ఐదు షోలు పర్మిషన్ తీసుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. పెద్ద సినిమాలకు ఓ వారం పాటు ఐదు షోలు వేసుకునే అవకాశం ఇంతకుముందు ఇచ్చారు. అంతేకాదు టికెట్ల రేటు కూడా పెంచుకునే ఛాన్స్ ఉంది. తెలంగాణా ప్రభుత్వం సినిమా పరిశ్రమ అభివృద్ధికి సపోర్ట్ గా నిలుస్తుంది. పుష్ప నైజాం లో ఐదు షోలు పడితే ఫస్ట్ డే ఓపెనింగ్ భారీగా కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.

అయితే ఏపీలో మాత్రం రెగ్యులర్ గా నడిచే నాలుగు షోలకే పర్మిషన్ ఉంది. అక్కడ టికెట్ల రేట్లు కూడా తక్కువగా ఉన్నాయి. టికెట్ల రేట్లపై ఏపీ థియేటర్ యాజమాన్య సంఘాలు హైకోర్ట్ లో కేసు వేశారు. టికెట్ల రేట్లు విషయంలో ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని కోర్ట్ కూడా తీర్పు ఇచ్చింది. ఏపీలో పుష్ప సినిమాకు టికెట్లు రేట్లు పెరిగే అవకాశం ఉందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

తెలంగాణాలో మాత్రం ఐదు షోలతో పాటుగా టికెట్ల రేట్లను కూడా పెంచి వసూళ్లు రాబట్టాలని చూస్తున్నారు. యూఎస్ లో కూడా భారీగా ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. అక్కడ కూడా పుష్ప భారీ రేంజ్ లో రిలీజ్ అవుతుంది. సుకుమార్ డైరక్షన్ లో తెరకెక్కిన పుష్ప సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. సినిమాలో సమంత ఓ స్పెషల్ ఐటం సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ఊ అంటావా సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో సెన్సేషన్ అయ్యింది. థియేటర్ లో ఈ పాట ఫ్యాన్స్ ని విజిల్స్ వేసేలా చేస్తుందని అంటున్నారు. అదే కాదు సినిమాలో పుష్ప రాజ్ పాత్రతో సుకుమార్ చాలా ప్రయోగాలు చేశాడని తెలుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ నట విశ్వరూపం ఈ సినిమాలో చూపించేశాడని టాక్.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: