ఊ అంటావా ఉఊ అంటావా పురుష సంఘాల తీవ్ర నిరసన !

Seetha Sailaja
ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఊ అంటావా ఊఊ అంటావా’ పాట పై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ప్రతి పురుషుడి వెనుక ఒక కీలక శక్తిగా స్త్రీ ఉంటుందని సమాజంలో స్త్రీల కు పురుషులు ఎంతో గౌరవం ఇస్తున్నారని అలాంటిది పురుష సమాజాన్ని కించ పరిచే విధంగా ‘పుష్ప’ లో ఐటమ్  సాంగ్ ఉంది అన్న విమర్శలు వస్తున్నాయి.  


వాస్తవానికి ఐటమ్  సాంగ్స్ లో స్టార్ హీరోయిన్లు నటించడం ఎప్పటి  నుంచో జరుగుతోంది. సాధారణంగా ఇలాంటి ఐటమ్ సాంగ్స్ గురించి  యూత్ బాగా మాట్లాడుకుంటాయి కాని ఆ సాంగ్ పురుషు ప్రపంచానికి  అవమానంగా మారింది అంటూ ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కినట్లుగా వార్తలు రావడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ పాటపై నెటిజన్ ల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.



ఇది ఇలా ఉంటే ఈపాట సమంత ఇమేజ్ కి డ్యామేజ్ చేస్తుందని కూడ కొందరు అభిమానులు  కామెంట్స్  చేస్తున్నారు. మరికొందరు అయితే  చైతన్య నుంచి విడిపోతున్నానని ప్రకటించిన సమంతకే ‘పుష్ప’ లో ఐటమ్ ఆఫర్ రావడం వెనక చాలా మతలబులు ఉన్నాయని  విశ్లేషిస్తున్నారు. ఊ అంటావా ఊఊ అంటావా?  పాట లిరిక్స్ లో సామ్ వ్యక్తిగత వ్యవహారాన్ని కనెక్ట్ చేశారని లిరికిస్ట్ చంద్ర బోస్ తెలివిగా కొన్ని పదాలను ఎంపిక చేసుకున్నారని గుసగుస లు వినిపిస్తున్నాయి.  


ఇక విడాకుల ప్రకటన వెంటనే ‘పుష్ప’ ఐటమ్ సాంగ్ కి అంగీకరించడం వెనక సామ్ స్ట్రాటజీనే వేరు అని కూడ అన్న కామెంట్స్ వినిపి స్తున్నాయి. సమంత ఇప్పుడు మళ్ళీ టాప్ హీరోల సినిమాలలో నటిస్తూ ఇది వరకు లానే గ్లామర్ ఎక్స్ పోజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. తన ప్రయత్నాలకు ఈ ఐటమ్ సాంగ్ లో నటించడం ద్వారా మరింత వేగం పెంచి తాను ఇప్పటికీ గ్లామర్ రోల్స్ కు రెడీ అన్న సంకేతాలు సమంత ఈ సాంగ్ ద్వారా ఇచ్చినట్లు అర్థం అవుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: