పుష్ప కొడితే.. బాలీవుడ్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

shami
కరోనా వల్ల ఇంకా బయట ఇండస్ట్రీలు సెట్ అవలేని పరిస్థితి. బాలీవుడ్ వాళ్లైతే ఇంకా సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే ఉన్నారు. అయితే టాలీవుడ్ మాత్రం వరుస సినిమాల రిలీజ్ లతో దూసుకెళ్తుంది. ఈ ఇయర్ మొదట్లోనే తెలుగు సినిమా సత్తా చాటగా మీరు రిలీజ్ చేయండి మేము థియేటర్లకు వచ్చి చూస్తామని సినిమా మీద ఉన్న ప్రేమని చూపించారు తెలుగు ప్రేక్షకులు. ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో సమ్మర్ కి ముందు వరకు కొన్ని సినిమాలు రిలీజ్ అవడం సూపర్ హిట్ అవడం తెలిసిందే.

అయితే కరోనా సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ అదే పరిస్థితి రిపీట్ అయ్యింది. సినిమాలు రిలీజ్ చేసినా ఆడియెన్స్ వస్తారా రారా అన్న డౌట్ ఉండింది. మొత్తానికి మరోసారి తెలుగు ప్రేక్షకులు సినిమా మీద ఉన్న అభిమానాన్ని చూపిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు సినిమా ఒక ఎమోషన్ .. అందుకే వారు సినిమాల కోసం వెయిట్ చేస్తారు. అయితే బాలీవుడ్ పరిస్థితి ఇలా లేదు అక్కడ సినిమాలు క్యూ కట్టాల్సి ఉంది.

ఇప్పటికే ఈ ఇయర్ అన్ని రికార్డులను టాలీవుడ్ తన పేరు మీద రాసుకోగా ఇయర్ ఎండింగ్ లో పుస్పగా వస్తున్న అల్లు అర్జున్ బాక్సాఫీస్ పై తన వీరంగం చూపించనున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న పుష్ప సినిమా హిట్టు పడితే మాత్రం బాలీవుడ్ మొత్తం మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పొచ్చు. 250 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వస్తున్న పుష్ప బ్లాక్ బస్టర్ పడితే మాత్రం 500 కోట్ల టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక మిగిలి ఉన్న రికార్డులను ఎలాగు జనవరి 7న వచ్చే rrr తుడిచేసే అవకాశం ఉంది. పుష్ప ఆ తర్వాత rrr తెలుగు సినిమా సత్తా చాటడంలో తగ్గేదేలే అన్నట్టు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: