బుల్లి పిట్ట: ఈ మొబైల్ ను అప్డేట్ చేయకుండా ఉంటేనే మేలట..!!
ముఖ్యంగా వన్ ప్లస్ నైన్ యూజర్లు ఎన్నో సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు XDA డెవలపర్స్ ఏజెన్సీ కనుగొన్నది. ఇక అంతే కాదు రెడిట్ థ్రెడ్ లో వన్ ప్లస్ నైన్ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యలను తెలుపుతూ ఉన్నట్లు సెక్యూరిటీ రీసెర్చర్లు సమాచారం ఇచ్చారు. ఆక్సిజన్ ఓఎస్ అప్డేట్ ను ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫోన్ కాల్స్ లో సమస్యలు వస్తున్నట్లు, వైఫై కనెక్షన్ కూడా స్లో అవుతున్నట్లు.. ఇక స్మార్ట్ఫోన్ లాగింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు యూజర్లు రేడిట్ థ్రెడ్ లో పేర్కొన్నారు.
మరికొంత మంది యూజర్లు అయితే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో ఆటో ఫిల్ అనే ఆప్షన్ పని చేయడం లేదు అని, యానిమేషన్ కూడా బాగా ల్యాగ్ అవుతోందని కమ్యూనిటీ ఫోరం లో పోస్టులు పెడుతున్నారు యూజర్లు. ఇక పోతే ఇలాంటి సమస్యలపై వన్ ప్లస్ కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారికంగా స్పందించడం లేదు. ఈ వన్ ప్లస్ ఆక్సిజన్ ఓఎస్ అప్డేట్ ప్రస్తుతం భారత దేశంతో పాటు ఉత్తర అమెరికా వంటి దేశాలలో అందుబాటులోకి వచ్చింది. ఈ సమస్యపై వన్ ప్లస్ అధికారికంగా స్పందిస్తుందో లేదో చూడాలి మరి.