అతను గెలిస్తే బాగుంటుంది.. బయటికొచ్చిన కాజల్ కామెంట్స్?

praveen
బుల్లితెర ప్రేక్షకులందరికీ ఆకర్షిస్తున్న బిగ్బాస్ ప్రస్తుతం మరింత హాట్ హాట్ గా మారిపోయింది. దాదాపుగా 98 రోజుల నుంచి తెలుగు ప్రేక్షకులందరినీ అలరిస్తున్న బిగ్బాస్ ఐదవ సీజన్ ప్రస్తుతం చివరి అంకానికి చేరుకుంది. మొన్నటి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ కొనసాగారు. ఈ క్రమంలోనే టాప్ ఫైవ్ లో కి ఎవరు వెళ్తారు అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలోనే తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా కాజల్ ఇక ఇంటి నుంచి ఎలిమినేట్ అయింది. దీంతో ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సిరి, శ్రీ రామచంద్ర, మానస్,సన్నీ, షణ్ముఖ్ లు టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా మారిపోయారు.

 ఇకపోతే ఇక బిగ్ బాస్ ఫైనల్ మరికొన్ని రోజుల్లో జరగబోతుంది దీంతో బిగ్ బాస్ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు గెలవ బోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ఇకపోతే ఇటీవల కాజల్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యింది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత కంటెస్టెంట్ లు బిగ్ బాస్ బజ్ అనే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఈ కార్యక్రమంలో హౌస్లో ఎదురైన అనుభవాలను పంచు కుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అటు ఇటీవలే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్  అయ్యి మళ్లీ బయటికి వచ్చిన కాజల్ కూడా బిగ్ బాస్ బజ్ అనే కార్యక్రమంలో పాల్గొంది.

ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో తనకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి.. అన్న విషయాన్ని కాజల్ చెప్పుకొచ్చింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో సన్నీ మానస్ తనకు మంచి స్నేహితులుగా మారిపోయారు అంటూ కాజల్ తెలిపింది. అయితే ఇక బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సన్ని, మానస్ లలో ఎవరు టైటిల్ విన్నర్గా నిలవాలని మీరు కోరుకొంటున్నారు అంటూ అని ప్రశ్నించగా.. సన్నీ టైటిల్ విన్నర్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అతనికి కప్పు గెలవాలనే కసి ఎక్కువగా ఉంది అంటూ కాజల్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: