సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తం లోని నెంబర్ వన్ స్టార్ గా ఎదిగారు రజనీకాంత్. నిజం చెప్పాలంటే దేశంలోనే మొదటి పాన్ ఇండియా స్టార్ గా రజినీకాంత్ గారిని చెప్పుకోవచ్చు. బాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి అగ్ర హీరోలు కూడా దేశవ్యాప్తంగా అంత మార్కెట్ లేదు. కానీ రజనీకాంత్ మాత్రం తన పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీసు రికార్డులు కొల్లగొట్టాడు. ఇక సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆయన తర్వాత అంతటి స్టార్డమ్ సంపాదించిన హీరో మెగాస్టార్ చిరంజీవి.ముఖ్యంగా 90 లలో అగ్రహీరోగా ఫుల్ ఫామ్ తో దూసుకుపోతున్న చిరంజీవి ఒక సినిమాకి కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకొని సంచలన రికార్డు నెలకొల్పాడు.
ఇక బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసిన చిరంజీవి అక్కడ కూడా తన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. అయితే అక్కడ మాత్రం చిరు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదనే చెప్పాలి. అయితే దాదాపుగా ఒకే జనరేషన్ కి చెందిన చిరంజీవి, రజనీకాంత్ ఇద్దరు వెండి తెరపై తిరుగులేని హీరోలుగా గా ఎదిగారు. అంతేకాదు ఈ ఇద్దరు అగ్ర హీరోల మధ్య కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీ కి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. ఇండస్ట్రీ లో స్థిరపడ్డారు. హీరో కావాలనే కోరికతో చెన్నై వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నారు. ఇక ఈ ఇద్దరిలో లో ఉన్న మరొక కామన్ పాయింట్ ముందు విలన్స్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తరువాత హీరోలుగా ఎదిగారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మొదట్లో విలన్ గా నటించాడు. ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో అవకాశాలు అందుకుని హీరోగా స్థిరపడ్డాడు.
అటు రజనీకాంత్ కెరీర్ కూడా ఇదే విధంగా సాగింది. ఆయనకు కూడా మొదట్లో హీరోగా అవకాశాలు రాలేదు. అందుకే ముందు విలన్ గా చేసి ఆ తర్వాత నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుని హీరోగా అవకాశాలు అందుకున్నాడు. ఇక హీరోలుగా వెండితెరపై చరిత్ర సృష్టించిన చిరంజీవి, రజనీకాంత్ ఇద్దరు కూడా రాజకీయాల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2009 ఎన్నికల్లో పోటీ చేశాడు. అనుకున్న ఫలితాలు రాకపోవడంతో రాజకీయాల నుంచి వెనుదిరిగాడు. రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పి అనూహ్యంగా వెనకడుగు వేసాడు. ఇటీవల 2021 తమిళనాడు ఎన్నికలకు ముందు తన రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇక ఈ విషయంలో అటు చిరంజీవి రజనీకాంత్ ఇద్దరు కూడా తమ అభిమానులను నిరాశ పరిచారు అని చెప్పాలి...!!