సెల్ఫ్ డిఫెన్స్ లో రాజమౌళి !
‘ఆర్ ఆర్ ఆర్’ కథ విషయమై రాజమౌళి నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఒకటికి పదిసార్లు ‘ఫిక్షన్ ఫిక్షన్’ అంటూ అనేకసార్లు క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు జక్కన్న మాటల పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తెలుగు జాతి చరిత్రలో అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ ల చరిత్ర శాస్వితం.
అలాంటి వారిద్దరి పాత్రలను తీసుకుని రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ చేత ఈమూవీ కథ వ్రాయించాడు. చరిత్రలో ఎక్కడా ఎప్పుడు అల్లూరి కొమరం భీమ్ లు కలిసిన సందర్భాలు లేవు. అయితే వీరిద్దరూ కలిసినట్టు అదేవిధంగా వీరిద్దరూ కలిసి బ్రిటీష్ వారి పై పోరాటం చేసినట్లు ‘ఆర్ ఆర్ ఆర్’ కథలో ఒక ఊహాజనితమైన కథను అల్లారు.
ఇప్పుడు ఈ ఊహా జనితమైన కథ పై విమర్శకుల నుండి విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అన్న భయంతో రాజమౌళి ఒకటికి పదిసార్లు మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా ఫిక్షన్ ఫిక్షన్ అంటూ ముందు చూపుతో వ్యవహరిస్తున్నాడు. ఒక ఇండియన్ బ్రిటీష్ పోలీస్ ఆఫీసర్ ఆంగ్లేయులు చేస్తున్న అరాచకాలను చూడలేక చిట్టచివరకు అల్లూరి సీతారామరాజు గెటప్ లో చరణ్ మారిపోయినట్లు ట్రైలర్ లో చూపించి ఇది అల్లూరి కథ కాదు కేవలం తన ఊహ మాత్రమే అన్న సంకేతాలు రాజమౌళి ఇస్తున్నాడు.
వాస్తవానికి ఇప్పటి తరానికి అల్లూరి చరిత్ర కానీ కొమరం భీమ్ చరిత్ర కానీ ఏమి తెలియదు. రాజమౌళి చూపించిందే చరిత్ర అనుకుంటారు కాబట్టి విమర్శకుల నుండి విపరీతమైన దాడి జరిగే ఆస్కారం ఉంది. దీనితో మాహిష్మతి సామ్రాజ్యం ఎలా రాజమౌళి ఊహించుకున్నాడో అల్లూరి కొమరం భీమ్ ల కలయికను ఊహించుకున్నాని పదేపదే చెపుతున్నట్లు అనిపిస్తోంది. అంతేకాదు తన సినిమాలో చరణ్ జూనియర్ కనిపించరని కేవలం వారి పాత్రలు మాత్రమే కనిపిస్తాయి అని చెపుతూ చరణ్ జూనియర్ అభిమానుల నుండి ఎలాంటి మాటల దాడి తన పై జరగకుండా చాల ముందు చూపుతో వ్యవహరిస్తున్నాడు..