భీమ్లా నాయక్ రన్ టైం ను ఫిక్స్ చేసిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కె చంద్ర దర్శకత్వం లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్, ఈ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్  లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనున్ కొషియన్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను, టీజర్ లను, పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావడంతో ఈ మూవీ ని సంక్రాంతి కానుక గా జనవరి 12 వ తేదీ న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. అయితే తాజా గా భీమ్లా నాయక్ చిత్ర బృందం ఈ సినిమా రన్ టైం ను లాక్ చేసినట్లు తెలుస్తోంది.  


భీమ్లా నాయక్ లో స్పెషల్ సాంగ్స్, ఇతర పాటలు, అనవసర సన్నివేశాలు లేకుండా గ్రిప్పింగ్‌ స్ర్కీన్‌ ప్లే తో కేవలం 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేసినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే భీమ్లా నాయక్ సినిమా కంటే వారం రోజులు ముందుగా విడుదల అవుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా రన్ టైం దాదాపు మూడు గంటలకు పైగా నే అని తెలుస్తోంది. అలాగే భీమ్లా నాయక్ సినిమా తరువాత రెండు రోజులకు విడుదల అవుతున్న రాధే శ్యామ్ సినిమా రన్ టైం  కూడా ఎక్కువ అని తెలుస్తోంది.  ఈ రెండు సినిమాలతో పోల్చుకుంటే భీమ్లా నాయక్ రన్ టైం తక్కువ అని తెలుస్తోంది, అయినప్పటికీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సాగే ఈ రన్ టైం ఈ  సినిమాకు చాలా బాగా ప్లస్ అవుతుందని చిత్ర బృందం అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: