ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ లో రాజమౌళిస్ట్రాటజీ
నిన్న ఉదయం విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ ట్రైలర్ మ్యానియాతో సోషల్ మీడియా దద్దరిల్లి పోయింది. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో సృష్టిస్తున్న విధ్వంసాన్ని చూసినవారు ఈమూవీ ట్రైలర్ కే ఇలా పూనకాలు వచ్చి జనం ఊగిపోతూ ఉంటే జనవరి 7న ఈసినిమా కలక్షన్స్ పరంగా సృష్టించపోయే విధ్వంసం గురించి అప్పుడే అనేక ఊహాగానాలు మొదలైపోయాయి.
3.07 నిమిషాలు నిడివి తో ఉన్న ఈ ట్రైలర్ లోని యాక్షన్ సీన్స్ రోమాలు నిక్కబొడుచుకునే విధంగా ఉన్నాయి అంటూ విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి సీత పాత్రలో నటించిన అలియా భట్ ను పోలీసులు కాలితో తన్నడం భీమ్ చేతిలో రామరాజు దెబ్బలు తినడం వంటి సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. ఈ ట్రైలర్ హంగామా ఇలా కొనసాగుతూ ఉండగానే ఈ ట్రైలర్ వెనుక రాజమౌళి అనుసరించిన వ్యూహం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
వాస్తవానికి ఈమూవీ ట్రైలర్ ను ధియేటర్లలో 10గంటలకు ప్రదర్శిస్తారు యూట్యూబ్ లో 4 గంటలకు విడుదల చేస్తారు అనిప్రకటించడంతో తెలుగు రాష్ట్రాలలోని చాల ధియేటర్ల వద్ద విపరీతంగా జనం గుమి కూడతంతో ఈరోజే ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అవుతోందా అన్న భావన కలిగింది. అయితే అదే సమయానికి యూట్యూబ్ లో కూడ ఈమూవీ ట్రైలర్ ను విడుదల చేసి అటు ధియేటర్ల వద్ద అదేవిధంగా సోషల్ మీడియాలోనూ ఉప్పెన లాంటి వాతావరణాన్ని సృష్టించడంలో రాజమౌళి విజవంతం అయ్యాడు.
దీనితో రాజమౌళి మార్కెటింగ్ వ్యూహాలను చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపడుతున్నాయి. ఒక మంచి సినిమాను తీయడమే కాదు ఆ సినిమాను ఏవిధంగా ప్రమోట్ చేయాలి అన్న విషయం జక్కన్న కు బాగా తెలుసు. అందుకే భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానేజిమెంట్ విద్యార్ధులకు గతంలో ‘భాహుబలి’ విడుదల తరువాత పాఠాలు చెప్పించిన విషయం తెలిసిందే. అంచనాలకు అనుగుణంగా ‘ఆర్ ఆర్ ఆర్’ ఘనవిజయం సాధిస్తే రాజమౌళి పేరు మరొకసారి మారుమ్రోగి పోతుంది..