ఏపీలో టిక్కెట్ ధ‌ర‌ల‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

VUYYURU SUBHASH
ఏపీ లో ఆన్ లైన్ టికెటింగ్ తో పాటు టిక్కెట్ల ధరల పై ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు నాలుగైదు సార్లు ఆంధ్రప్రదేశ్ వెళ్లి సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు మంత్రి పేర్ని నాని ని కలిసి దఫాలుగా చర్చలు జరిపి వచ్చారు. అయినా ఏపీ ప్రభుత్వం తీరు మాత్రం మారలేదు. టికెట్ రేట్లు తగ్గించే స్తూ జీవో జారీ చేసింది. దీనికితోడు బెనిఫిట్ షోలు కూడా క్యాన్సిల్ చేసింది. ఆంధ్రప్రదేశ్ టికెట్ రేట్లు 1990 సంవత్సరానికి ముందు ఎలా ఉండేవో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఈ టికెట్ రేట్ల‌తో సినిమాలు తీయ‌లేమ‌ని పలువురు వాపోతున్నారు.

టికెట్ రేట్లు పెంచాలని... సినిమా పరిశ్రమను ఆదుకోవాలని పదేపదే ఇండస్ట్రీ పెద్దలు సీఎం జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకున్నా జగన్ మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో టిక్కెట్ల ధరల సమస్యపై కళ్యాణ్ విమర్శలు చేశారు. జగన్ గారు పరిశ్రమకు సాయం చేసే చర్యలు తీసుకోవాలని... ఇప్పుడున్న ధరల పై ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పారు. అఖండ‌ పూర్తిగా బాలకృష్ణ స్టామినా అని చెప్పారు.

గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి సినిమాకు ఇలాంటి సమస్య వచ్చిందని... ప్రజల నుంచి చెడ్డపేరు వస్తుందని అధికారులు హెచ్చరించినా కూడా ఆనాడు వైఎస్ వినలేదని చెప్పారు. ఇప్పుడు దాస‌రి లాంటి ప్రభావితమైన వ్యక్తి ఎవరు ఇండస్ట్రీ లో లేరు అని ... ఎన్టీఆర్ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరకు ప్రతి ముఖ్యమంత్రి తెలుగు సినిమా రంగానికి అనుకూలంగా ఉన్నారు అని... అయితే ఇటీవల కాలంలో కొంత గ్యాప్ వచ్చిందని కళ్యాణ్ చెప్పారు.

పారదర్శక విధానాన్ని కొనసాగించటానికి ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని తెలుగు సినిమా నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరారని.. అయితే సోషల్ మీడియా దానిని వక్రీకరించింది అని కళ్యాణ్ చెప్పారు. ఇక అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది... దీని గురించి మాట్లాడుతూ గోల‌తో సంబంధం లేకుండా సినిమా బాగుంటే థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు అనేందుకు ఈ సినిమా పెద్ద ఉదాహరణ అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: