చిరంజీవి అల్లు అర్జున్ వ్యూహాలలో బోయపాటి !

Seetha Sailaja

‘వినయ విధేయ రామ’ ఫ్లాప్ కావడంతో దర్శకుడు బోయపాటి శ్రీను గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. అప్పటివరకు అతనితో సినిమాలు చేయాలని భావించిన టాప్ హీరోలు అంతా మౌనంగా ఉండిపోయారు. మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకుని ‘అఖండ’ తో బోయపాటి తానేమిటో మరొకసారి నిరూపించుకుని మళ్ళీ టాప్ దర్శకుల లిస్టులోకి చేరిపోయాడు.

నిన్నటి వరకు క్రేజ్ అంతంత మాత్రంగా ఉన్న బాలకృష్ణను ‘అఖండ’ గా మార్చి సరైన దర్శకుడు చేతిలో పడితే బాలయ్య ‘ఆటం బాంబ్’ లా ఎలా మారిపోగలడో ఇండస్ట్రీకి అర్థం అయ్యేలా బోయపాటి బాలయ్యను చూపించాడు. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని అత్యంత భారీ కలక్షన్స్ వైపు ‘అఖండ’ పరుగులు తీస్తూ ఉండటంతో ఇప్పుడు మళ్ళీ టాప్ హీరోలలో బోయపాటి మ్యానియా ప్రారంభం అయింది.

ఒక సూపర్ హిట్ కొట్టిన దర్శకుడును వెంటనే తమవైపు తిప్పుకోవడంలో చిరంజీవి అల్లు అర్జున్ లకు ప్రత్యేకమైన ప్రావీణ్యత ఉంది. దీనితో ఇప్పుడు బోయపాటితో సినిమా చేయాలని అటు బన్నీ ఇటు చిరంజీవి కూడ చాల గట్టిగా ప్రయత్నిస్తున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ విడుదల తరువాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ మూవీ చేయవలసి ఉంది.

అయితే ఈమూవీ చేసే విషయంలో బన్నీ ఇంకా స్థిర నిర్ణయం తీసుకోలేదు అని అంటున్నారు. దీనితో ఐకాన్ మూవీ ప్రాజెక్ట్ ను కొద్దిగా పక్కకుపెట్టి బోయపాటితో మూవీ చేసే విషయంలో బన్నీ సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. ఈ పరిస్థితులు ఇలా ఉంటే చిరంజీవి కూడ బోయపాటితో సినిమా చేయాలని ఆలోచనలు చేస్తున్నాడని ఒక మంచి మాస్ కథ ఉంటే తనను కలవమని ఇప్పటికే చిరంజీవి బోయపాటికి సందేశం పంపాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో మెగా  కాంపౌండ్ అల్లు కాంపౌండ్ రాయబారాలతో బోయపాటి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. హిట్ ఉంటే చాలు దర్శకులకు ఎలాంటి డిమాండ్ ఉంటుందో అర్థం అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: