టాలీవుడ్ సీనియర్
హీరో మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఏకంగా ఒకేసారి నాలుగు
సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. తాను తాజాగా నటించిన 'ఆచార్య'
సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా.. ఆ సినిమాకు సంబంధించి కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉంటే దాని కోసం చిరు పనిచేస్తున్నారు. దీంతోపాటు మూడు సినిమాలను లైన్ లో పెట్టిన ఆయన.. సమాంతరంగా ఒకే సారి వాటి షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇక ఈ మూడు చిత్రాలలో బాబి డైరెక్ట్ చేస్తున్న
సినిమా కూడా ఉంది. ఇటీవలే ఈ
సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.
మెగాస్టార్ కు వీరాభిమాని అయిన బాబి ఫాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో..
తన సినిమాలో
మెగాస్టార్ ని అలా చూపెట్టబోతున్నానంటూ ముందు నుంచే చెబుతూ వస్తున్నాడు. ఇక ఈ
సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ ఐపోతుంది. ఇక ఈ
సినిమా ప్రీ లుక్ చూస్తేనే ఈ
సినిమా కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది అని అర్థమవుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ రూమర్ ఫిల్మ్ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతోంది. ఈ
సినిమా ఫ్రీ లుక్ లో చిరు ముఠామేస్త్రి తరహా లుక్ లో కనిపించగా.. దీన్ని చూసిన అందరూ పోర్ట్ ఏరియాలో పనిచేసే ఒక కూలి పాత్రను
చిరంజీవి పోషిస్తున్నట్లు అందరూ అనుకున్నారు. అయితే పైకి ఈ పాత్ర అలా ఉన్నా దాని అసలు రూపం వేరే ఉందట.
చిరంజీవి ఇందులో ఓ అండర్ కవర్
పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. సినిమాలో ఇంటర్వెల్ వరకు ఊర
మాస్ లుక్ లో కనిపించే చిరు ఆ తర్వాత పోలీసు అవతారంలో కనిపిస్తారని.. ఇక సెకండాఫ్ మొత్తం అదే లుక్ మెయిన్ టైన్ చేస్తారని తెలుస్తోంది. అంతేకాదు దర్శకుడు బాబి ఈ సినిమాకి
శ్రీలంక నేపధ్యాన్ని జోడించాడని అదికూడా సినిమాలో మెయిన్ హైలెట్ గా ఉంటుందని సమాచారం. ఇక ఈ వార్త వైరల్ అవ్వడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అగ్ర నిర్మాణ సంస్థ
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు...!!